Kapuluppada:కాపులుప్పాడ రేపటి మాదాపూర్ కానుందా? విశాఖ ఐటీ హిల్స్ ముఖచిత్రం మారుతుందా?
Kapuluppada: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం.. ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో హాట్ టాపిక్‌గా మారింది
Kapuluppada
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం.. ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నగర శివార్లలోని ‘కాపులుప్పాడ’ ప్రాంతం కొద్ది కాలంలోనే హైదరాబాద్ హైటెక్ సిటీ, మాదాపూర్ తరహాలో ఒక మెగా ఐటీ కారిడార్‌గా రూపాంతరం చెందుతోంది.
ఏపీ ప్రభుత్వం విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన , రాయితీలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఐటీ హిల్స్ చుట్టూ ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కేవలం సాఫ్ట్‌వేర్ రంగమే కాకుండా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలకు కాపులుప్పాడ(Kapuluppada) కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
తాజాగా ప్రపంచ ప్రఖ్యాత RMZ గ్రూప్ సుమారు 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఇక్కడ 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడమనేది విశాఖకు ఒక చారిత్రాత్మక మలుపుగా మారనుంది. అంతేకాదు కాగ్నిజెంట్ సంస్థ 8,000 మందికి పైగా ఉపాధి కల్పించే భారీ క్యాంపస్‌ను కూడా ఇక్కడే నిర్మిస్తోంది.
దీనికి తోడు అదానీ గ్రూప్ , గూగుల్ సంయుక్తంగా చేపడుతున్న ఏఐ హబ్ ప్రాజెక్టు విశాఖను డేటా రంగంలో టాప్‌లో నిలబెట్టనుంది. రానున్న ఐదు నుంచి ఆరేళ్లలో ఈ ఒక్క కారిడార్ ద్వారానే సుమారు లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోయడమే కాకుండా, స్థానిక రియల్ ఎస్టేట్ రంగానికి కూడా భారీగానే బూస్ట్ ఇస్తోంది.

మౌలిక సదుపాయాల పరంగా చూస్తే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాపులుప్పాడకు ఉన్న కనెక్టివిటీ ఈ ప్రాంతానికి అతిపెద్ద అసెట్ అవుతుంది. ఆరు వరుసల బీచ్ కారిడార్, బోయపాలెం-కాపులుప్పాడ లింక్ రోడ్ల ద్వారా ప్రయాణం చాలా ఈజీ అవుతోంది. ఇక్కడ పని చేసే ఉద్యోగుల కోసం అత్యున్నత స్థాయి గృహ సముదాయాలు, కమర్షియల్ స్పేస్‌లు వేగంగా నిర్మిస్తున్నారు.
ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించిన కాపులుప్పాడ(Kapuluppada), ఇప్పుడు గ్లోబల్ కంపెనీల రాకతో విశాఖను దక్షిణ భారతదేశంలోని చెన్నై, బెంగళూరు నగరాలకు దీటుగా నిలబెట్టబోతోంది. దీంతో యువతకు సొంత రాష్ట్రంలోనే గొప్ప అవకాశాలు లభించే రోజులు ఇక దగ్గర్లోనే ఉన్నాయని కాపులుప్పాడ అభివృద్ధి నిరూపిస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sarva Darshan : తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ మూడు రోజులు సర్వదర్శనం టోకెన్లు రద్దు




One Comment