Pawan Kalyan: దజీట్ పవన్ కళ్యాణ్ అని ఇందుకే అంటారేమో..
Pawan Kalyan: విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన రాజాపు సిద్ధూ(Rajapu Siddhu) అనే ఇంటర్మీడియట్ విద్యార్థి సృజనాత్మకతకు పవన్ కళ్యాణ్ మంత్రముగ్ధులయ్యారు.

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే, సినీ రంగంలో తాను కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). నిరాడంబరత, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత, యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వంటి లక్షణాలు ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థానంలో నిలుపుతూనే ఉంటాయి.
Pawan Kalyan
ఎన్ని పనులు ఉన్నా, సమాజంలో జరుగుతున్న మంచిని, ముఖ్యంగా యువతలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో పవన్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించడమే కాకుండా, లక్ష రూపాయల ప్రోత్సాహకం అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు పవన్.
బ్యాటరీ సైకిల్ సృష్టికర్త సిద్ధూకు పవన్ ఆశీస్సులు
సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా బ్యాటరీతో నడిచే సైకిల్ ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేశాడు సిద్ధూ. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన రాజాపు సిద్ధూ(Rajapu Siddhu) అనే ఇంటర్మీడియట్ విద్యార్థి సృజనాత్మకతకు పవన్ కళ్యాణ్ మంత్రముగ్ధులయ్యారు.
ఈ వినూత్న ఆవిష్కరణ గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, సిద్ధూని ప్రత్యేకంగా అభినందించాలని నిర్ణయించుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధూ ప్రతిభ గురించి తెలుసుకుని, అతన్ని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి (Mangalagiri Camp Office) పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు.
సిద్ధూ ఆవిష్కరణను స్వయంగా పరీక్షించిన పవన్
కార్యాలయానికి వచ్చిన సిద్ధూతో పవన్ కళ్యాణ్ స్నేహపూర్వకంగా సంభాషించారు. సిద్ధూ ఆవిష్కరించిన బ్యాటరీ సైకిల్‌ను స్వయంగా నడిపి పరీక్షించారు. అతని ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలు తెలుసుకుని అబ్బురపడ్డారు. కేవలం బ్యాటరీ సైకిల్ మాత్రమే కాకుండా, సిద్ధూ రూపొందించిన ‘గ్రాసరీ గురూ’ వాట్సప్ సర్వీస్ బ్రోచర్‌ను కూడా చూసి ప్రత్యేకంగా అభినందించారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ స్వయంగా తొక్కుతూ సిద్ధూని వెనుక కూర్చోబెట్టుకుని మరీ రౌండ్లు వేసి చిన్న పిల్లాడిలా ముచ్చటపడ్డారు. సిద్ధూ ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ, ప్రోత్సాహకంగా లక్ష రూపాయల చెక్కును అందించారు. సిద్ధూ వంటి యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడం ద్వారా, పవన్ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలోని మరొక గొప్ప కోణాన్ని ఆవిష్కరించిందని అంటున్నారు.