Revenue: ఇటు మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..అటు ఏపీ,తెలంగాణల మధ్య రెవెన్యూ వార్
Revenue: డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు , క్లబ్బులు రాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని తాజాగా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
Revenue
నూతన సంవత్సర వేడుకలంటేనే ఉత్సాహం, ఊపు. ఈ ఊపును క్యాష్ చేసుకోవడంలో తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ ఏడాది (2026) న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు , క్లబ్బులు రాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని తాజాగా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిర్ణయం వెనుక కేవలం మందుబాబుల సంతోషం మాత్రమే కాదు, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను మార్చే ఒక భారీ ‘లిక్కర్ ఎకానమీ’ దాగి ఉందంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.
ప్రధానంగా రెండు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన ఆర్థిక(Revenue) కారణాలు ఉన్నాయి. తెలంగాణలో ఎక్సైజ్ శాఖ ఈ డిసెంబర్ నెలలో దాదాపు 4000 కోట్ల రూపాయల ఆదాయాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది. గతేడాది ఒక్క డిసెంబర్ 31వ తేదీనే తెలంగాణలో 402 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి.
సాధారణ రోజుల్లో 100 నుంచి 150 కోట్లు ఉండే అమ్మకాలు, ఈ రెండు రోజుల్లో 8 నుంచి 10 రెట్లు పెరుగుతాయి. తెలంగాణ అంత కాకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చాక ఏపీ ప్రభుత్వం విక్రయాల ద్వారా 500 కోట్ల రూపాయల ఆదాయాన్ని(Revenue) ఆశిస్తోంది. ఇది రాష్ట్ర బడ్జెట్లో కీలకమైన సంక్షేమ పథకాలకు , అభివృద్ధి పనులకు నిధులను సమకూర్చడానికి ఒక మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలసీలో తేడాలను గమనిస్తే..తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్‌ను ‘గ్లోబల్ సిటీ’గా ప్రమోట్ చేస్తోందన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఐటీ హబ్ ఉండటం వల్ల పబ్‌లు, ఈవెంట్స్ , లగ్జరీ హోటల్స్ పై ఎక్కువ ఫోకస్ ఉంది. అందుకే రాత్రి 1 గంట వరకు ఈవెంట్లకు పర్మిషన్ ఇస్తూ, పబ్‌లలో ప్రీమియం బ్రాండ్ల సేల్స్ పెంచేలా ప్లాన్ సిద్ధం చేసింది.

అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ప్రభుత్వం కేవలం సిటీలకే పరిమితం కాకుండా ‘స్టేట్ వైడ్’ సేల్స్ పైన దృష్టి పెట్టింది. పర్యాటక ప్రాంతాలైన విశాఖపట్నం, విజయవాడ , తిరుపతి (నిషేధిత ప్రాంతాలు మినహా) వంటి చోట్ల టూరిజం హోటల్స్‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఏపీలో కూడా రెండు రోజుల పాటు (డిసెంబర్ 31 , జనవరి 1) సమయాన్ని పొడిగించడం ద్వారా తెలంగాణలా ఎక్కువ ఆదాయాన్ని(Revenue) రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల హోటల్ , హాస్పిటాలిటీ రంగానికి పెద్ద ఊతం లభిస్తుంది. హోటల్స్ లో ఆక్యుపెన్సీ 75-85 శాతం పైగా పెరుగుతుంది. దీనివల్ల వందలాది మందికి టెంపరరీగా ఉపాధి లభిస్తుంది. అయితే, నాణేనికి మరోవైపు ఉన్నట్లుగా దీనివల్ల సామాజిక రిస్కులు కూడా ఎక్కువే.
మద్యం విక్రయాల సమయం పెంచడం వల్ల రోడ్డు ప్రమాదాలు 20 శాతం వరకు పెరిగే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల పోలీసు శాఖపై పనిభారం విపరీతంగా పెరుగుతుంది. ఒక్క హైదరాబాద్‌లోనే వేల సంఖ్యలో పోలీసులు రోడ్లపై కాపలా కాస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం ,పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా గట్టి నిఘా ఏర్పాటు చేశాయి. పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇక్కడే అందరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వాలు ఇచ్చే ఈ వెసులుబాటును బాధ్యతాయుతంగా వాడుకుంటూ సురక్షితంగా వేడుకలు జరుపుకోవడమే అందరి బాధ్యత అని తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి.



