Visakhapatnam
భారత దేశంలో పర్యాటక ప్రదేశాలు అంటే ఒకప్పుడు కేరళలో ఉండే మున్నార్,తమిళనాడులో ఉండే కొడైకెనాల్,ఊటీ అని ఇలా కొన్ని ప్రదేశాలు చెప్పుకునేవాళ్లం . కానీ ఇకపై మాకూ ఓ అద్భుతమైన పర్యాటక ప్రదేశం.. విశాఖపట్నం(Visakhapatnam) ఉంది అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. ఎందుకంటే విశాఖపట్నం పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లో ఇటీవల నిర్మించిన 55 మీటర్ల పొడవు గల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి, దేశంలోనే అతిపెద్ద కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది.
ఈ బ్రిడ్జి కేవలం ఒక నిర్మాణం కాదు, ప్రకృతి ప్రేమికులకు, సాహస ప్రియులకు విశాఖ అందాలను గాలిలో తేలియాడుతూ ఆస్వాదించే ఒక అద్భుతమైన అవకాశం. ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నం(Visakhapatnam) మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) మరియు RJ అడ్వెంచర్స్ మధ్య ఒక విజయవంతమైన పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP)కు నిదర్శనం.
Work from home: వర్క్ ఫ్రమ్ హోమ్ వరంలా కనిపించే సవాల్.. బ్యాలెన్స్ చేయడం ఎలా?
ఈ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ. 7 కోట్లు ఖర్చయ్యాయి. కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లోని టైటానిక్ వ్యూపాయింట్ వద్ద ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీనికి కింది నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం ఒక చివర మాత్రమే ఆధారం ఉండటం దీనికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ డిజైన్ వల్ల సందర్శకులకు గాలిలో తేలియాడే విభిన్నమైన అనుభూతి కలుగుతుంది. నిర్మాణ సమయంలో అత్యాధునిక ఇంజనీరింగ్ పద్ధతులు, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించారు. ఒకేసారి 40 మంది సందర్శకులు ఈ బ్రిడ్జిపై సురక్షితంగా నడవొచ్చు. ఈ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 2024లో ప్రారంభించి, రికార్డు సమయంలో పూర్తి చేశారు.
ఈ గ్లాస్ బ్రిడ్జి విశాఖపట్నం(Visakhapatnam) పర్యాటకానికి ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ఒక కీలక కేంద్రంగా ఇది నిలిచిపోతుంది. దీని ద్వారా విశాఖకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది, దానితో పాటు స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, రవాణా రంగం వంటివి అభివృద్ధి చెందుతాయి. టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో VMRDAకి 40% వాటా వస్తుంది, ఇది ప్రభుత్వ ఖజానాకు ఒక మంచి ఆదాయ వనరుగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ, భద్రత కోసం కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భారతదేశంలో ఇలాంటి గ్లాస్ బ్రిడ్జిలు చాలా తక్కువ. కేరళలోని వగమోన్ గ్లాస్ బ్రిడ్జి 40 మీటర్ల పొడవుతో రెండో అతిపెద్దదిగా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్ బ్రిడ్జి, జార్ఖండ్‌లోని మోదకం బ్రిడ్జి వంటివి కూడా పర్యాటక కేంద్రాలుగా పేరు పొందాయి. అయితే, వాటితో పోలిస్తే విశాఖ గ్లాస్ బ్రిడ్జి డిజైన్, పొడవు పరంగా ప్రత్యేకమైనది. కైలాసగిరిలో ఇప్పటికే ఉన్న రంగుల పర్యావరణం, ప్రకృతి అందాలకు ఈ కొత్త బ్రిడ్జి మరింత వన్నె తెచ్చిపెట్టింది. ఈ బ్రిడ్జి విశాఖపట్నంను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.