Global City
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం భవిష్యత్తుపై చేసిన తాజా ప్రకటనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. సముద్రం ఒడ్డున వెలసిన ఈ నగరాన్ని కొత్త దశకు తీసుకెళ్లేందుకు మూడు కీలక (Global City)ప్రాజెక్టులు – మెట్రో రైలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ విస్తరణ – అన్నీ వేగంగా ముందుకు కదులుతున్నాయని ఆయన స్పష్టం చేయడంతో విశాఖ ప్రజల్లో మరోసారి నమ్మకం పెరిగింది.
ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టును త్వరలో ఏర్పాటు చేస్తారు. నగరానికి మెట్రో రావడం అనేది చాలా ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న కల. ఎందుకంటే, ఉద్యోగులకు, విద్యార్థులకు, రోజూ ప్రయాణం చేసే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు బాగా పెరిగాయి. NAD, మధురావాడ, RTC కాంప్లెక్స్, గాజువాక వంటి ప్రాంతాల్లో రద్దీ తగ్గడానికి మెట్రోనే శాశ్వత పరిష్కారం. మెట్రో రాగానే ప్రయాణం వేగం పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది, ముఖ్యంగా ఐటీ పార్క్, పోర్ట్, ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ చాలా బలపడుతుంది. మెట్రో ఉన్న నగరాలు (Global City)ఎప్పుడూ ఇన్వెస్టర్లకు ఫేవరెట్‌గా ఉంటాయి, విశాఖ కూడా అదే స్థాయికి చేరే రోజు దూరంలో లేదని తెలుస్తోంది.
ఇదే సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) కూడా వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనితో విశాఖ యొక్క గ్లోబల్ కనెక్టివిటీ పూర్తిగా మారబోతోంది.
పెద్ద విమానాలు, విదేశీ ఫ్లైట్స్, అంతర్జాతీయ కార్గో సదుపాయాలు అన్నీ వచ్చాక పరిశ్రమలు, బిజినెస్, టూరిజం రంగాలు బలంగా పెరుగుతాయి. ఉత్తర ఆంధ్ర మొత్తం ఈ విమానాశ్రయంతో కలిసిపోతుంది. వ్యాపారం చేసేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒక నగరానికి వచ్చినపుడు విదేశీ కంపెనీలు ఆ ప్రాంతానికి రావాలనే నమ్మకం పెరుగుతుంది.
ఇప్పటికే విశాఖలో ఐటీ రంగం (IT Sector) వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకే రోజు ఎనిమిది కొత్త ఐటీ కంపెనీలకు పునాది రాయి వేయడం అనేది నగరం ఎలా మారబోతోందో చెప్పే ఒక మైలురాయి (Milestone) లాంటిది. కాగ్నిజెంట్ (Cognizant) వంటి పెద్ద కంపెనీలు రావడం వల్ల యువతకు 25,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగం విస్తరిస్తే యువతకు ఉద్యోగాలు పెరుగుతాయి, స్టార్టప్‌లు వస్తాయి, రెంటల్ హౌసింగ్, ఆఫీస్ కల్చర్ అన్నీ కొత్త స్థాయికి చేరుతాయి.
ఈ మూడు ముఖ్యమైప ప్రాజెక్టులు (Global City)కలిసి విశాఖ రూపురేఖలను మరో విధంగా తీర్చిదిద్దబోతున్నాయి. మెట్రో నగర రోడ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. భోగాపురం విమానాశ్రయం ప్రపంచానికి ద్వారం తెరుస్తుంది. ఐటీ కంపెనీలు నగర ఆర్థిక వ్యవస్థకు కొత్త ప్రాణం పోస్తాయి. ఈ మార్పులు పూర్తయితే విశాఖపట్నం ఆంధ్రలో మాత్రమే కాదు, దేశంలో కూడా టాప్ డెవలప్‌డ్ సిటీల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
