Gold Prices:బంగారం బేజార్.. 1980 నాటి సీన్ రిపీట్ కాబోతోందా?
Gold Prices: ఇలాంటి భారీ పతనం సమయంలో తొందరపడి బంగారం, వెండి అమ్మకాలు జరపడం కంటే, మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం మంచిది.
Gold Prices
కొన్నాళ్లుగా ముక్కుపిండి వసూలు చేసిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు కొనుగోలుదారులు షాక్ అయ్యేలా ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ. లక్షా 90 వేల రికార్డు స్థాయి నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే రూ. లక్షా 50 వేలకు పడిపోవడం అంటే చిన్న విషయం కాదు. అటు వెండి అయితే ఏకంగా రూ. 4 లక్షల మార్క్ నుంచి సగానికి సగం అంటే రూ. 2.27 లక్షలకు పడిపోయి ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బ తీస్తోంది.
ఈ భారీ కరెక్షన్ వెనుక అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పెను మార్పులే ప్రధాన కారణం అంటున్నారు బిజినెస్ విశ్లేషకులు.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ అనుకోనివిధంగా బలపడటంతో బంగారంపై పెట్టుబడులు తగ్గిపోయాయి. ట్రెజరీ బాండ్లపై రాబడి పెరగడం ఇన్వెస్టర్లను అటువైపు మళ్లించింది.
అలాగే పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం తర్వాత పన్నుల మార్పులు, ట్రేడ్ డీల్స్ ఎఫెక్ట్‌తో భారత్ లో బంగారం ధరల క్షీణతకు ఆజ్యం పోసినట్లు అయింది.
వీటితో పాటు ఇరాన్‌తో అమెరికా డీల్ ఉండవచ్చని వినిపిస్తున్న వార్తలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ మార్పు వంటి పరిణామాలు కూడా ఇన్వెస్టర్లలో భయాన్ని (Fear Sentiment) నింపాయి. దీనివల్ల భారీగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి ధరలు కుప్పకూలిపోయాయి.

అయితే ప్రస్తుత పరిస్థితిని చూసి మార్కెట్ విశ్లేషకులు 1980నాటి పసిడి సంక్షోభాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కూడా బంగారం ధరలు (Gold Prices)విపరీతంగా పెరిగి, మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఏకంగా 26 ఏళ్లు పట్టిందన్న విషయాన్ని చెబుతున్నారు. ఇప్పుడు కూడా నెలల వ్యవధిలోనే రెండు మూడు రెట్లు పెరిగిన ధరలు, మళ్లీ ఎప్పుడు స్థిరపడతాయో విశ్లేషకుల అంచనాకు కూడా అందడం లేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల మార్కుకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు జోస్యం చెప్తున్నారు.
ఇక సిల్వర్ ETFలలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం ఇప్పుడు సినిమా కనిపిస్తోందనే చెప్పొచ్చు. ట్రెడిషనల్ ఇన్వెస్టర్లు అంటే బంగారాన్ని ఆస్తిగా భావించేవారు ఈ కరెక్షన్‌ను చూసి బెంబేలెత్తిపోతున్నారు. అయితే, మార్కెట్ నిపుణుల సలహా ప్రకారం.. ఇలాంటి భారీ పతనం సమయంలో తొందరపడి బంగారం, వెండి అమ్మకాలు జరపడం కంటే, మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం మంచిది. సామాన్యులకు, పెళ్లిళ్ల సీజన్ రాబోతుండటంతో బంగారం కొనాలకున్నవారికి మాత్రం తగ్గుతున్న ఈ బంగారం ధరలు(Gold Prices) ఒక రకంగా ఊరటనిచ్చే విషయంగానే చెప్పొచ్చు.
WPL : ఎలిమినేట్ అయ్యేది ఎవరో ?..నాకౌట్ కు ఢిల్లీ , గుజరాత్ రెడీ



