Just LifestyleHealthLatest News

Biohacking:అనారోగ్యానికి చెక్- యవ్వనానికి ఫిక్స్.. ఇదే బయో హ్యాకింగ్ సీక్రెట్

Biohacking: మన శరీరాన్ని ఒక కంప్యూటర్ లాగా అనుకుంన, అందులోని లోపాలను హ్యాక్ చేసి సరిదిద్దుకోవడమే ఈ బయో హ్యాకింగ్.

Biohacking

సాధారణంగా ఎవరికైనా వంట్లో బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. కానీ బయో హ్యాకింగ్(Biohacking) చేసేవారు అసలు అనారోగ్యం రాకుండా ముందే తమ శరీరం ఎప్పుడూ 100% పవర్ ఫుల్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎలా అని సింపుల్‌గా చెప్పాలంటే, మన శరీరాన్ని ఒక కంప్యూటర్ లాగా అనుకుంన, అందులోని లోపాలను హ్యాక్ చేసి సరిదిద్దుకోవడమే ఈ బయో హ్యాకింగ్.

బయో హ్యాకింగ్ ఎలా చేస్తారంటే..
కోల్డ్ థెరపీ (Cold Therapy).. ఉదయాన్నే చన్నీళ్లతో స్నానం చేయడం లేదా ఐస్ గడ్డలు ఉన్న నీళ్లలో కాసేపు ఉండటం చేస్తారు. దీనివల్ల బాడీలోని వాపులు (Inflammation) తగ్గి, మన మెదడు చాలా షార్ప్‌గా పనిచేస్తుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. రోజులో ఒక నిర్ణీత సమయంలోనే ఆహారం తీసుకుంటారు. దీనివల్ల మన కణాలు పాత మలినాలను తీసేసి (Autophagy), తమను తాము రీఛార్జ్ చేసుకుంటాయట.
రెడ్ లైట్ థెరపీ .. సాయంత్రం వేళల్లో సాధారణ లైట్లు కాకుండా ఎర్రటి వెలుతురులో ఉంటారు. ఇలా ఉండటం వల్ల నిద్ర హార్మోన్ (Melatonin) బాగా రిలీజవుతుందట.
న్యూట్రిజెనోమిక్స్ .. మనం తినే ఆహారం మన జీన్లపై (Genes) ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుని, శరీరానికి సరిపడే ఫుడ్ మాత్రమే తీసుకుంటారు.

Biohacking
Biohacking

దీనివల్ల లాభం ఏంటంటే..బయో హ్యాకింగ్ (Biohacking)వల్ల మనిషి వృద్ధాప్యాన్ని (Ageing) ఆలస్యం చేయొచ్చు. అంతేకాదు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటం, జ్ఞాపకశక్తి పెరగడం, మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవడం కూడా దీనివల్ల సాధ్యమవుతుంది.

Tilak Varma : వార్మప్ లో తిలక్ వర్మ అదుర్స్..యూఎస్ఏపై భారత్ ఏ విక్టరీ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button