Just BusinessLatest News

Gold prices:పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు!

Gold prices:నిన్న ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ. 2 వేలకు పైగా పెరగడంతో బంగారం కొనుగోలుదారులు షాక్ అయ్యారు.

Gold prices

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరలు(Gold prices) ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిణామాల ప్రభావంతో పసిడి ధరలు(Gold prices) రోజురోజుకూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే తులం (10 గ్రాముల) బంగారం ధరపై ఏకంగా రూ. 2 వేలకు పైగా పెరగడంతో బంగారం కొనుగోలుదారులు షాక్ అయ్యారు. అదే బాటలో వెండి ధర కూడా ఒక్క రోజులోనే కిలోకు రూ. 10 వేల వరకు పెరిగి కొనుగోలుదారులను బిత్తరపోయేలా చేస్తోంది. జనవరి 27వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న తాజా ధరల వివరాలను ఒకసారి చూద్దాం

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (శుద్ధ బంగారం) ధర రూ. 1,61,960 ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,48,460 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో కూడా హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్ల ధర రూ. 1,61,960 ,అలాగే 22 క్యారెట్ల ధర రూ. 1,48,460 వద్ద ఉంది.
దేశంలోనే అత్యధికంగా చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,63,920 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,50,260 కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీ లో 24 క్యారెట్ల ధర రూ. 1,62,110 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,48,610 వద్ద ట్రేడవుతోంది.
ముంబై , బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ. 1,61,960 అలాగే 22 క్యారెట్ల ధర రూ. 1,48,460 వద్ద స్థిరంగా ఉన్నాయి.

Gold prices
Gold prices

బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది. రిపబ్లిక్ డే రోజు అంటే నిన్న ఒక్క రోజే కిలో వెండిపై రూ. 10 వేల పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 3,75,100 వద్ద కొనసాగుతోంది. శుభకార్యాల సీజన్ కావడంతో ధరలు పెరిగినా కూడా నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఈ స్థాయిలో ధరలు పెరగడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.

Hill Stations:రద్దీ లేని ప్రదేశానికి ట్రిప్‌కు వెళ్లాలా? టాప్ 5 ఆఫ్ బీట్ హిల్ స్టేషన్లు ఇవే..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button