Just BusinessLatest News

Cloud Kitchen:క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలో ఐడియా లేదా..అయితే ఇది మీకోసమే..

Cloud Kitchen:ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నవారకి రెస్టారెంట్ అద్దె, ఫర్నిచర్, డెకరేషన్ అంటూ లక్షల్లో ఖర్చవుతుంది.

Cloud Kitchen

ఈ రోజుల్లో ఆఫీసు రాజకీయాలకు , బాసుల టార్గెట్‌లకు చాలామంది విసిగిపోతున్నారు. దీంతో సొంతంగా వ్యాపారం చేయాలనే కోరిక చాలామందిలో పెరుగుతోంది. కానీ పెట్టుబడి దగ్గరే ఆలోచించి కొంతమంది ఆగిపోతుంటారు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నవారకి రెస్టారెంట్ అద్దె, ఫర్నిచర్, డెకరేషన్ అంటూ లక్షల్లో ఖర్చవుతుంది.

ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా, కేవలం మీ ఇంట్లోని వంటగది నుంచే ఓ బిజినెస్ చేయొచ్చు. ఈ సరికొత్త వ్యాపారమే క్లౌడ్ కిచెన్ (Cloud Kitchen). దీనిని ఘోస్ట్ కిచెన్ లేదా వర్చువల్ కిచెన్ అని కూడా పిలుస్తున్నారు. అంటే ఇక్కడ కస్టమర్లు వచ్చి కూర్చుని తినడానికి స్థలం ఏమీ అక్కరలేదు. కేవలం ఆన్‌లైన్ ఆర్డర్లను తీసుకుని, వంట చేసి పంపడం మాత్రమే ఉంటుంది.దీనికి కుకింగ్ మీద ఇంట్రస్ట్ ఉన్న ఆడవాళ్లు, మగవాళ్లు ఎవరైనా చేసుకోవచ్చు. బిజినెస్ పెరిగాక ఇంట్లో వాళ్ల హెల్ప్ కూడా తీసుకోవచ్చు.

ముందుగా మీరు ఏ వంటకాల్లో స్పెషలిస్ట్ అనేదాన్ని బట్టి మీ మెనూ సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు హోమ్లీ మీల్స్, స్పెషల్ బిర్యానీలు , హెల్తీ సలాడ్స్ ఇలా మీరు ఏ వంటకాన్ని బాగా చేయగలరో ఆ లిస్టును తయారు చేసుకోండి. అయితే ఈ బిజినెస్ కోసం భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) నుంచి లైసెన్స్ తీసుకోవాలి.

Cloud Kitchen
Cloud Kitchen

ముఖ్యంగా ఈ క్లౌడ్ కిచెన్(Cloud Kitchen) బిజినెస్ కోసం ఆన్‌లైన్ డెలివరీ భాగస్వాములైన స్విగ్గీ, జొమాటోలలో మీ కిచెన్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. క్లౌడ్ కిచెన్‌లో టేస్ట్ ఎంత ముఖ్యమో, ప్యాకింగ్ కూడా అంతే ముఖ్యమన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.

చూడగానే టెంప్టింగ్ అయ్యేలా వంటకాలు చేయడమే కాదు.. బయటకు ఒలిగిపోకుండా ప్యాక్ చేసి.. వేడిగా కస్టమర్‌కు చేరేలా జాగ్రత్త పడాలి. ప్రారంభంలో తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి, ఆర్డర్లు పెరిగే కొద్దీ వ్యాపారాన్ని విస్తరించొచ్చు.

Municipal Elections: క్లైమాక్స్‌కు వచ్చేసిన తెలంగాణ మున్సిపల్ పోరు.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరికి ప్లస్?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button