Mana Shankara Vara Prasad Garu:బాస్ వస్తున్నాడు..ఓటీటీలోకి మన శంకర వరప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
Mana Shankara Vara Prasad Garu: జనవరి 12న విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
Mana Shankara Vara Prasad Garu
బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదన్న సంగతి మనమంతా చూశాం. చాన్నాళ్ల తర్వాత బాస్ తన వింటేజ్ కామెడీ , యాక్షన్‌తో థియేటర్లను షేక్ చేశారు. జనవరి 12న విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు( Mana Shankara Vara Prasad Garu) సినిమా ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
మెగాస్టార్ కు జోడీగా నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో మెరవడం ఈ సినిమాకు అసలైన బూస్ట్ ఇచ్చిందంటున్నారు ఆడియన్స్. ఇక థియేటర్లలో ఓ రేంజ్లో రచ్చ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు మీ ఇంట్లోకి రావడానికి డేట్ ఫిక్స్ చేసుకుంటోందట.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 తెలుగు ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక క్రేజీ వీడియోను రిలీజ్ చేస్తూ, బాస్ ఈజ్ కమింగ్ అంటూ హింట్ కూడా ఇచ్చేసింది.
అయితే అఫీషియల్‌గా ఒక డేట్ ప్రకటించకపోయినా, ఫిబ్రవరి రెండో వారంలో అంటే ఫిబ్రవరి 13 లేదా 14వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. సంక్రాంతి మిస్ అయిన వారు, అలాగే బాస్-వెంకీ కాంబోను మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మెగాస్టార్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ మూవీలో హైలైట్ గా నిలిచాయి. చిరంజీవి, వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ వంటిదని మెగా అండ్ దగ్గుబాటి ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో ఓటీటీలో కూడా ఈ సినిమా రికార్డ్ వ్యూస్ సాధించడం ఖాయమని అర్థమవుతోంది.
దీనిపైన త్వరలోనే జీ 5 సంస్థ నుంచి మన శంకర వరప్రసాద్ గారు( Mana Shankara Vara Prasad Garu )రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రాబోతుంది. బాస్ రూలింగ్ ఇంట్లోనే షురూ కాబోతోంది కాబట్టి ..మెగా ఫ్యాన్స్, వెంకటేష్ అభిమానులు అంతా రెడీగా ఉండండి,
Alcohol:లిక్కర్ తాగితే పోయేది లివర్ మాత్రమే కాదు..W.H.O చెప్పిన భయంకరమైన నిజాలేంటో చూడండి?



