Silver prices:బంగారాన్ని మించి పెరుగుతున్న వెండి ధరలు..ఏడాదిలోనే 100 శాతం ఎందుకు పెరిగాయి?
Silver prices:ఏడాది క్రితం వెండిలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, అది ఇప్పుడు 2 లక్షల 15 వేల రూపాయలు అయ్యేది. అంటే ఏడాదిలోనే వంద శాతం పైగా లాభం వచ్చేదని నిపుణులు చెబుతున్నారు.
Silver prices
బంగారం రేటు పెరుగుతోందంటే షాక్ అవ్వక్కర లేదు, కానీ ఇప్పుడు వెండి ధరలు (Silver Rates) బంగారాన్ని మించి పరుగులు పెడుతున్నాయి. వెండి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఆల్ టైమ్ రికార్డు రేట్లను టచ్ చేస్తూ వెండి దూసుకుపోతోంది. వెండి రేటు కొండలా పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. బంగారం కొనాలన్న ఆశ ఎలాగూ అందని ద్రాక్షలా అయ్యింది. ఇప్పుడు వెండి కూడా అలాగే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిలో డబుల్ లాభం…మీరు ఏడాది క్రితం వెండిలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, అది ఇప్పుడు 2 లక్షల 15 వేల రూపాయలు అయ్యేది. అంటే ఏడాదిలోనే వంద శాతం పైగా లాభం వచ్చేదని నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో కిలో వెండి(Silver prices) రేటు రూ. 89,700 లోపు ఉండేది. కానీ ఇప్పుడు అది ఏకంగా రెండు లక్షల రూపాయల మార్కును దాటిపోయింది. లేటెస్టుగా కిలో వెండి రేటు రూ. 2.15 లక్షల మార్కును టచ్ చేసి రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సిల్వర్ పరుగులు ఎందాక అనేది నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు
గత ఏడాది నుంచి ఇప్పటిదాకా వెండి (Silver prices)రేట్లు భారీగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఫెడ్ కోతలు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టిన వడ్డీ రేట్ల కోతలు, రూపాయి పతనం వల్ల వెండి రేట్లకు రెక్కలు వచ్చాయని అనలిస్టులు చెబుతున్నారు.
డాలర్ బలహీనత.. ఇదే సమయంలో డాలర్ బలహీనపడడం కూడా రేట్ల ర్యాలీకి మరో కారణంగా మారింది.
ఇండస్ట్రియల్ డిమాండ్: పారిశ్రామిక డిమాండ్ (Industrial Demand) కూడా పెరగడంతో సిల్వర్ రేట్లకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి.
ఈ ఒక్క వారంలోనే వెండి (Silver prices)ధరలు ఏకంగా రూ. 19,100 పెరిగాయి. ఇంత భారీగా వెండి రేట్లు పెరగడంతో, దాని అమ్మకాలు (Sales) సుమారు 10 శాతం దాకా తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. భవిష్యత్తులో సిల్వర్ రేట్లు ఇంకా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం కొనలేకపోతున్నాం, వెండితో సరిపెట్టుకుందాం అనుకునేవారికి ఈ ధరల పెరుగుదల గట్టి షాక్ ఇస్తోంది.



