Tata Harrier EV :టాటా హారియర్ EV- అదిరిపోయే ఫీచర్లు.. ఈ కారును కొనడం తెలివైన నిర్ణయమేనా?
Tata Harrier EV : కారు లోపల స్థలం ఎక్కువగా ఉంటుంది సేఫ్టీ పరంగా కూడా చాలా బలంగా ఉంటుంది.
Tata Harrier EV
టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ హారియర్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకువస్తోంది. డీజిల్ హారియర్ ఇప్పటికే తన లుక్స్ , సేఫ్టీతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు రాబోయే ఈ EV వెర్షన్ సరికొత్త టెక్నాలజీతో రానుంది.
టాటా హారియర్ EV ముఖ్య ఫీచర్లు..
AWD (All Wheel Drive) సిస్టమ్- టాటా హారియర్ EV(Tata Harrier EV )లో అతిపెద్ద మార్పు ఏంటంటే ఇది ‘ఆల్ వీల్ డ్రైవ్’ ఆప్షన్‌తో వస్తోంది. అంటే ఈ కారుతో మీరు ఎలాంటి కఠినమైన రోడ్ల మీదైనా (Off-roading) సులభంగా ప్రయాణించొచ్చు. డీజిల్ హారియర్‌లో ఈ ఫీచర్ లేదు.
రేంజ్ (Range)-ఇందులో సుమారు 60kWh నుంచి 80kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా.
యాక్చువే-ఇ (Acti.ev) ప్లాట్‌ఫారమ్- టాటా వారి సరికొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ మీద నిర్మించబడింది. దీనివల్ల కారు లోపల స్థలం ఎక్కువగా ఉంటుంది సేఫ్టీ పరంగా కూడా చాలా బలంగా ఉంటుంది.
అధునాతన ఫీచర్లు- 12.3-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీల కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ , అడ్వాన్స్‌డ్ ADAS (లెవల్ 2) వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.
V2L, V2V ఛార్జింగ్-ఈ కారు నుంచి మీరు ఇతర ఎలక్ట్రిక్ వస్తువులకు పవర్ ఇవ్వొచు (Vehicle to Load), అలాగే మరో ఎలక్ట్రిక్ కారును కూడా ఛార్జ్ చేయొచ్చు (Vehicle to Vehicle).
కొనడానికి కారణాలు (Pros)- టాటా కార్లంటేనే సేఫ్టీకి మారుపేరు. హారియర్ EV కూడా 5-స్టార్ రేటింగ్‌తో వచ్చే అవకాశం ఉంది.దీని ఫ్యూచరిస్టిక్ డిజైన్ , క్లోజ్డ్ గ్రిల్ కారుకు చాలా ప్రీమియం లుక్ ఇస్తాయి. డీజిల్ ధరలతో పోలిస్తే, ఎలక్ట్రిక్ కారు మెయింటెనెన్స్ ,రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ.

దీని ధర సుమారు రూ. 25 లక్షల నుంచి రూ. 32 లక్షల మధ్య ఉండవచ్చు. ఇది సామాన్యులకు కొంచెం భారమే.
హైవేల మీద ఇంకా ఛార్జింగ్ స్టేషన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు, కాబట్టి లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీరు ఎక్కువగా ప్రయాణిస్తూ, వారానికి ఒకసారి లాంగ్ డ్రైవ్ వెళ్లే ప్లాన్ ఉంటే.. అలాగే సేఫ్టీ , లగ్జరీ ఫీచర్లు కావాలనుకుంటేటాటా హేరియర్ ఈవీ( Tata Harrier EV )అద్భుతమైన ఛాయిస్. ఇది కేవలం కారు మాత్రమే కాదు, ఒక స్టేటస్ సింబల్ కూడా అవుతుంది.
Tata Harrier EV :టాటా హారియర్ EV- అదిరిపోయే ఫీచర్లు.. ఈ కారును కొనడం తెలివైన నిర్ణయమేనా?



