Just BusinessLatest News

Tata Safari: టాటా సఫారీ పెట్రోల్ వెర్షన్‌లో లగ్జరీ ఫీచర్లు.. ఈ కారు ఎవరికి బెస్ట్?

Tata Safari: బడ్జెట్ తక్కువ ఉన్నవారు స్మార్ట్ వేరియంట్‌ను .. పూర్తి లగ్జరీ కోరుకునే వారయితే ఆక్సిజన్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

Tata Safari

టాటా మోటార్స్ తన ఐకానిక్ ఎస్‌యూవీ సఫారీలో.. కారు లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెట్రోల్ వేరియంట్‌ టాటా సఫారీ(Tata Safari)ని జనవరి 7, 2026న ఘనంగా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇప్పటివరకు కేవలం డీజిల్ ఇంజిన్‌తోనే అందుబాటులో ఉన్న సఫారీ, ఇప్పుడు సరికొత్త 1.5-లీటర్ హైపీరియన్ టర్బో జీడీఐ (Hyperion Turbo GDI) పెట్రోల్ ఇంజిన్‌తో ముందుకు వచ్చింది. ఈ నిర్ణయం వల్ల సఫారీ మార్కెట్ మరింత విస్తరించనుంది.

ముఖ్యంగా ఈ పెట్రోల్ వేరియంట్ స్టార్టింగ్ ధర కేవలం రూ. 13.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. గరిష్టంగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 25.19 లక్షల వరకు ఉంటుంది. హారియర్ పెట్రోల్‌లో వాడిన అదే శక్తివంతమైన ఇంజిన్‌ను సఫారీలో కూడా వాడటం వల్ల దీని పవర్ పెర్ఫార్మెన్స్ అదిరేలా ఉంటుంది.

ఈ కొత్త పెట్రోల్ ఇంజిన్ సాంకేతిక వివరాలను గమనిస్తే, ఇది 170 పీఎస్ పవర్ , 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్‌తో పోలిస్తే టార్క్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా, పెట్రోల్ ఇంజిన్ ఇచ్చే స్మూత్ డ్రైవింగ్ అనుభవం , తక్కువ శబ్దం ప్రయాణికులను అలరిస్తాయి. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ , ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

కంపెనీ క్లెయిమ్ ప్రకారం ఈ కారు లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది .అలాగే గంటకు 216 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. అయితే రోడ్లు సరిగా లేనిచోట ఇది సుమారు 14 నుంచి 16 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే అవకాశం ఉంది. డీజిల్ ధరలు పెరుగుతుండటం, అలాగే పర్యావరణ నిబంధనలు కఠినతరం అవుతుండటంతో టాటా మోటార్స్ ఈ పెట్రోల్ వెర్షన్‌ను లాంచ్ చేయడం ఒక తెలివైన వ్యూహంగా కనిపిస్తోంది.

ఫీచర్ల పరంగా చూస్తే టాటా సఫారీ(Tata Safari) ఎక్కడా తగ్గలేదు. దీనిలో 5-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ సేఫ్టీ రేటింగ్, భారీ పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ , లెవల్-2 ఏడీఏఎస్ (ADAS) వంటి అత్యాధునిక రక్షణ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి స్మార్ట్, ప్యూర్, డిజైర్, ఫియర్‌లెస్, అడ్వెంచర్ , ఆక్సిజన్.

Tata Safari
Tata Safari

బడ్జెట్ తక్కువ ఉన్నవారు స్మార్ట్ వేరియంట్‌ను.. పూర్తి లగ్జరీ కోరుకునే వారయితే ఆక్సిజన్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. డీజిల్ ఇంజిన్‌లోని వైబ్రేషన్లు ఇష్టం లేని వారికి, తక్కువ ధరలో ప్రీమియం ఎస్‌యూవీ కావాలనుకునే వారికి ఈ పెట్రోల్ సఫారీ ఒక వరం అనే చెప్పాలి. మహీంద్రా XUV700 , హ్యుండాయ్ క్రెటా వంటి కార్లకు ఇది గట్టి పోటీని ఇవ్వబోతోంది.

సఫారీ పెట్రోల్ వెర్షన్‌లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని ధర డీజిల్ కంటే తక్కువగా ఉండటం అలాగే మెయింటెనెన్స్ ఈఈగా ఉండటం. మైనస్ విషయానికి వస్తే డీజిల్ ఇంజిన్ ఇచ్చే భారీ టార్క్ (350 Nm) ఇందులో ఉండదు, కాబట్టి లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు డీజిల్ అంత వేగంగా దూసుకుపోకపోవచ్చు.

అయితే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎస్‌యూవీ కోసం చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప ఛాన్స్. మీరు కూడా ఒక లగ్జరీ కారును ప్లాన్ చేస్తుంటే, ఒకసారి దగ్గరలోని షోరూమ్‌కు వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. అప్పుడు ఈ పెట్రోల్ సఫారీ ఎంత పవర్ ఫుల్ అనేది మీకే అర్థమవుతుంది.

Traffic:హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button