Just InternationalJust PoliticalLatest News

Iran vs Israel : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా..మిడిల్ ఈస్ట్ లో యుద్ధమేఘాలు

Iran vs Israel : ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల వ్యవహార శైలితో మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడైనా వార్ మొదలవ్వొచ్చు.

Iran vs Israel

ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ వార్ తోనే గత కొన్నేళ్లుగా ప్రపంచం నానా ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో వార్ సైరన్ మోగినట్టు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా వెనిజులాపై దాడి తర్వాత మరికొన్ని దేశాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో అమెరికా తనపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని భయపడుతున్న ఇరాన్(Iran vs Israel ).. కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది.

అమెరికా సైనిక స్థావరాలే కాకుండా ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీని కోసం పవర్‌ఫుల్ హైపర్ సోనిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించేందుకు సిద్ధమైనట్టు అరబిక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన 8 వైమానిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించబోతున్నట్టు సమాచారం. ఇజ్రాయెల్‌తో పాటు మిడిల్‌ ఈస్ట్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై కూడా గురిపెట్టినట్లు అరబిక్ మీడియా కథనాల సారాంశం.

అయితే ఇరాన్ యాక్షన్ ధీటుగా స్పందించేందుకు అటు ఇజ్రాయిల్ కూడా సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అది కూడా న్యూక్లియర్ మిస్సైల్స్ తో దాడి చేయాలని నిర్ణయించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఇజ్రాయిల్ నెగెవ్ ఎడారిలో భూమి కంపించడమే.  4.2 తీవ్రతో భూమి కంపించినట్టు గుర్తించారు ఇక్కడే రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించారేమోనని భావిస్తున్నారు. వాటి కారణంగానే భూప్రకంపనలు వచ్చినట్టు అనుమానిస్తున్నారు.

ఈ ప్రకంపనలు వచ్చిన సమయంలో ఇజ్రాయిల్ (Iran vs Israel )లోని విద్యాసంస్థల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూకంప కేంద్రంగా నిర్థారించిన డిమోనా ప్రాంతంలోనే ఇజ్రాయిల్ కు రహస్య అణు పరీక్షా కేంద్రం ఉంది.

Iran vs Israel 
Iran vs Israel

గత ఏడాది అమెరికాతో కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిపింది. ఆ సమయంలో ఇరాన్‌ కూడా అణు పరీక్షలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. పైగా 2025లో జరిపిన దాడుల తర్వాత 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు. దీనిపై అమెరికా, ఇజ్రాయిల వాదనలు భిన్నంగా ఉన్నాయి.

ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియంని బాంబుగా మార్చిందా అన్న అనుమానాలూ లేకపోలేదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికల అంచనా ప్రకారం ఇరాన్ వద్ద బాంబు తయారీకి అవసరమైన 90శాతం యురేనియం నిల్వలు ఉన్నాయి. అయితే యురేనియం అందుబాటులో ఉన్నా కూడా  దానిని ఒక వార్‌హెడ్ గా మార్చి క్షిపణికి అమర్చడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ.

పలు సవాళ్లతో కూడుకున్న ఈ రెండో ప్రక్రియను ఇరాన్ ఇంకా పూర్తి చేయలేదనే నిపుణులు భావిస్తున్నారు. మొత్తం మీద ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల వ్యవహార శైలితో మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడైనా వార్ మొదలవ్వొచ్చని తెలుస్తోంది.

Tata Safari: టాటా సఫారీ పెట్రోల్ వెర్షన్‌లో లగ్జరీ ఫీచర్లు.. ఈ కారు ఎవరికి బెస్ట్?

Related Articles

Back to top button