Instagram : ఇన్‌స్టాగ్రామ్ లవ్ స్టోరీ.. కన్నబిడ్డను బస్టాండ్‌లో వదిలేసిన తల్లి
Instagram : మాతృత్వం... ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన బంధం.

Instagram : మాతృత్వం… ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన బంధం. కానీ కొన్నిసార్లు, ఆ బంధాన్ని కూడా కాలరాసే సంఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. నల్గొండ బస్‌స్టాండ్ వేదికగా అలాంటి ఓ హృదయవిదారక, మానవత్వాన్ని , అమ్మతన్నాన్ని ప్రశ్నించిన ఘటన జరిగింది. పదిహేను నెలల కన్నబిడ్డను దిక్కులేని అనాధగా వదిలేసి, ప్రియుడి వెంట వెళ్లిపోయిన ఓ తల్లి అకృత్యం… చూసే వారి కళ్లను తడి చేసింది, మనసును మెలిపెట్టింది.
Instagram love story
నల్గొండ బస్‌స్టాండ్(Nalgonda bus stand)లో ప్రయాణికుల రద్దీ మామూలే. కానీ, ఓ మూల, పదిహేను నెలల బాబు దిక్కుతోచకుండా ఏడుస్తుండటంతో అక్కడి ఆర్టీసీ సిబ్బంది గమనించారు . అప్పటికే అమ్మ ఎక్కడికి వెళ్లిందో.. ఎందుకు వదిలేసిందో తెలియని ఆ బాబు అమాయకంగా అక్కడే అమ్మా అమ్మా పిలుస్తూ ఏడ్వడం చేసి అక్కడి వారు చలించిపోయారు. ఆకలి, భయం, ఆవేదన కలగలిసిన ఆ ఏడుపు విన్న సిబ్బంది గుండెలు బరువెక్కాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని.. అదృశ్యమైన తల్లిని గుర్తించేందుకు సీసీ కెమెరాలసాయం తీసుకున్నారు.. బస్‌స్టాండ్‌లోని ప్రతి కెమెరా ఫుటేజీ (CCTV footage) ని నిశితంగా పరిశీలించారు. క్షణక్షణం జూమ్ చేస్తూ, ఒక్కో ఫ్రేమ్‌ను క్షుణ్ణంగా చూస్తుంటే, ఒక బైక్‌పై చిన్నారిని అక్కడ వదిలేసిన మహిళ స్పష్టంగా కనిపించింది. పసివాడు బైకు వెనుక కూర్చున్న తల్లిని చూసి, గుర్తించినట్లుగా చేతులు ఊపడంతో పోలీసులు తనే బాబు తల్లిగా అనుమానించారు.
దాని ఆధారంగానే బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. బైక్ యజమానిని గుర్తించగా, అది తన స్నేహితుడు తీసుకెళ్లాడని తేలింది. ఆ స్నేహితుడిని విచారించగా, ఈ మొత్తం ‘ఇన్‌స్టాగ్రామ్ లవ్ స్టోరీ'(Instagram affair) డ్రామా బయటపడింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహితకు, నల్లగొండ పాతబస్తీకి చెందిన ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, చివరకు తన భర్తను, 15 నెలల బిడ్డను వదిలేసి, ఆ ప్రియుడితో వెళ్లిపోవాలనే దారుణ నిర్ణయానికి దారితీసింది. ఆ చిన్నారిని నేరుగా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకువచ్చి, అక్కడే వదిలేసి, ఆ యువకుడితో కలిసి ఉడాయించింది.చివరకు, కన్నతల్లి ప్రేమకు నోచుకోని ఆ పసివాడిని పోలీసులు తండ్రికి అప్పగించారు.