Just EntertainmentJust TelanganaLatest News

Gaddar Awards: గద్దర్ అవార్డుల గర్జన.. చిరంజీవి నుంచి చైతూ-రష్మిక వరకు విజేతల పూర్తి వివరాలు ఇవే..

Gaddar Awards:గద్దర్ ఫిల్మ్ అవార్డులు(Gaddar Awards) ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సరికొత్త జోష్‌ను నింపాయి.

Gaddar Awards

తెలంగాణ గడ్డ మీద విప్లవ గీతాలు ఆలపించిన ప్రజా యుద్ధనౌక గద్దర్.. స్మారకార్థం రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డులు(Gaddar Awards) ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సరికొత్త జోష్‌ను నింపాయి. 2025 సంవత్సరానికి సంబంధించి సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన ఆర్టిస్టుల జాబితాను జ్యూరీ సభ్యులు తాజాగా రిలీజ్ చేశారు.

ఈ అవార్డుల(Gaddar Awards) సెలక్షన్‌లో కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా.. సామాజిక బాధ్యత అలాగే కళాత్మక విలువలకు కూడా పెద్దపీట వేశారు. మొత్తం 17 మెయిన్ విభాగాలతో పాటు లెజెండరీ యాక్టర్ల పేర్లతో ఇచ్చే ప్రత్యేక పురస్కారాలను కూడా ప్రకటించారు. ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అట్టహాసంగా ప్రదానం చేయనున్నారు.

ఈ ఏడాది ప్రకటించిన స్పెషల్ పురస్కారాల్లో మెగాస్టార్ చిరంజీవిని ..ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో గౌరవించనుండటం విశేషం. అదే విధంగా అక్కినేని నేషనల్ అవార్డుకు సీనియర్ నటి జయసుధ, పైడి జయరాజ్ అవార్డుకు విశ్వనటుడు కమల్ హాసన్‌ను ఎంపిక చేశారు.

మేకింగ్ విభాగంలో మాత్రం అశ్వినీదత్‌కు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు జీవన రెడ్డి అవార్డు అలాగే ప్రజా నటుడు ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు దక్కాయి. ఇక ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు ప్రకటించగా, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సినారె పురస్కారంతో సత్కరించనున్నారు.

ఇక ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చూస్తే తండేల్ మూవీలో తన అద్భుత నటన కనబరిచినందుకు నాగచైతన్య ఉత్తమ నటుడిగా నిలిచారు. అలాగే ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో మెప్పించిన రష్మిక మందన్నను ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. ఈ ఏడాది బెస్ట్ మూవీగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ నిలవగా, అదే సినిమాకు డైరక్షన్ వహించిన సాయిలు ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు.

ఇతర ప్రధాన విభాగాల్లో దండోరా.. ద్వితీయ చిత్రంగా, ది ప్రీ వెడ్డింగ్ షో మూడో చిత్రంగా నిలిచాయి. సామాజిక సందేశాన్నిచ్చిన ‘కోర్టు’ సినిమాతో పాటు జాతీయ సమగ్రతను చాటిన ‘తండేల్’కు ప్రత్యేక గుర్తింపు లభించింది. పర్యావరణ పరిరక్షణ ఇతివృత్తంగా వచ్చిన ఇగ్వా మూవీ కూడా అవార్డును సొంతం చేసుకుంది.

Gaddar Awards
Gaddar Awards

టెక్నికల్ విభాగాల్లో ‘మిరాయ్’ మూవీ తన సత్తా చాటింది. ఈ మూవీకి గాను కార్తీక్ ఘట్టమనేని (సినిమాటోగ్రఫీ), శ్రీకర్ ప్రసాద్ (ఎడిటింగ్) ,స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు దక్కాయి. సహాయ నటుడిగా శివాజీ, సహాయ నటిగా భూమిక ఎంపికయ్యారు.

సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్ (దండోరా), గాయకుడిగా అనురాగ్, సింగర్‌గా సాహితి చాగంటి తమ ప్రతిభను చాటారు. ఇక హాస్యనటుడిగా కృష్ణ తేజ, కథా రచయితగా గుణశేఖర్, స్క్రీన్ ప్లే విభాగంలో అనిల్ రావిపూడికి అవార్డులను ప్రకటించారు. చిన్నారుల చిత్రాల్లో ‘అనగనగా’ అలాగే బాలనటుడిగా రోహన్ రాయ్‌ను ఎంపిక చేశారు. మొత్తంగా.. ఈ గద్దర్ అవార్డుల(Gaddar Awards) ప్రకటనతో టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లయింది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button