Just EntertainmentLatest News

Allu Arjun:బన్నీ నిజంగానే 42 రూల్స్‌ పెడతారా?ఈ కాంట్రవర్శీకి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడుతుందా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టార్గెట్‌గా చేసుకుని బాలీవుడ్ జర్నలిస్ట్ స్వీకృతితో పాటు బ్రాండ్ మేనేజర్ కావేరి బరువాలు చేసిన '42 రూల్స్' కామెంట్స్ టాలీవుడ్‌లో మంట రేపుతున్నాయి.

Allu Arjun

దక్షిణాది చిత్రాల ఖ్యాతి ఖండాంతరాలు దాటుతుంటే.. టాలీవుడ్ హీరోలు గ్లోబల్ స్టార్స్‌గా ఎదుగుతుంటే చూసి ఓర్వలేని బాలీవుడ్ మాఫియా మళ్లీ తన పాత బుద్ధులను బయటపెడుతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను టార్గెట్‌గా చేసుకుని బాలీవుడ్ జర్నలిస్ట్ స్వీకృతితో పాటు బ్రాండ్ మేనేజర్ కావేరి బరువాలు చేసిన ’42 రూల్స్’ కామెంట్స్ టాలీవుడ్‌లో మంట రేపుతున్నాయి.

బన్నీని కలవాలంటే 42 రూల్స్ ఉంటాయని, అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, కళ్లలోకి చూడకూడదని ఇలా ఎన్నో ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బన్నీ లీగల్ టీం రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడంతో బాలీవుడ్ బుద్ది మరోసారి బయటపడింది.

అయితే బన్నీ టీమ్ పరువు నష్టం దావా వేస్తామని ఇలా హెచ్చరించగానే, అలా ఆ జర్నలిస్ట్ తన వీడియోను డిలీట్ చేయడంతో పాటు, ఆ బ్రాండ్ మేనేజర్ తన సోషల్ మీడియా అకౌంట్స్ క్లోజ్ చేసేశారు. దీంతోనే ఇది కావాలని చేసిన కుట్ర అని అర్థమవుతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇటు ఈ 42 రూల్స్ అనేవి పచ్చి అబద్ధాలని గతంలో ఆయనతో పనిచేసిన సినీ తారలు చెప్పిన మాటలే సాక్ష్యం అన్న వీడియోలను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.. మలయాళ స్టార్ యాక్టర్ జయరాం ‘అల వైకుంఠపురములో’ సినిమా సమయంలో తెలుగు డైలాగ్స్ చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే..అల్లు అర్జున్ తన నుదుటిపై డైలాగ్స్ పేపర్ అతికించుకుని మరీ తనకు సహాయం చేసినట్లు ఆయనే స్వయంగా చెప్పారు.

ఇక బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అయిన గణేష్ ఆచార్య మాస్టర్ అయితే, బన్నీకి అస్సలు అహంకారం ఉండదని.., ఆయనకు మేనేజర్ కూడా అవసరం లేదని.., నేరుగా వెళ్లి బన్నీని పలకరించవచ్చని హిందీ ఇంటర్వ్యూల్లోనే కితాబిచ్చారు. ఇవే ఇప్పుడు 42 కండిషన్లు అన్న కామెంట్లకు జవాబు అని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు.

పుష్ప మూవీతో అల్లు అర్జున్ (Allu Arjun)ఉత్తరాదిలో ఒక ప్రభంజనాన్నే సృష్టించారు. అప్పటివరకు ఖాన్ల సామ్రాజ్యంగా ఉన్న బాలీవుడ్ నేలపై, ఒక్క హిందీ మూవీ కూడా నేరుగా చేయకుండానే అల్లు అర్జున్ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్నారు. పుష్ప-2 సినిమా రిలీజ్ అయితే.. తమ బాలీవుడ్ స్టార్ల రికార్డులన్నీ గాలిలో కలిసిపోతాయని భయపడుతున్న కొందరు బాలీవుడ్ శక్తులు, పెయిడ్ ఇంటర్వ్యూల ద్వారా అల్లు అర్జున్(Allu Arjun) ఇమేజ్‌ని దెబ్బతీయడానికి చూస్తున్నాయని.. దీనిలో భాగమే ఇది అని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

దక్షిణాది హీరోలపై బాలీవుడ్ ఇలా కుట్రలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇవే చేశారు. సలార్ మూవీ టైంలో షారుఖ్ ఖాన్ డంకీతో పోటీ పడుతున్నప్పుడు, డార్లింగ్ మూవీకి నార్త్‌లో థియేటర్లు దొరక్కుండా చేయడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి.

 Allu Arjun
Allu Arjun

అంతేకాదు పనిగట్టుకుని నెగిటివ్ రివ్యూలు రాయించడం, కావాలనే షోలు తగ్గించడం వంటి పనులతో ప్రభాస్ క్రేజ్‌ని తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభాస్ మాస్ పవర్ ముందు అవేవీ నిలబడకపోవడంతో చివరకు సైలెంట్ అయిపోయారు.

అంతెందుకు రామ్ చరణ్ – ఎన్టీఆర్ RRRతో గ్లోబల్ సక్సెస్ సాధించినప్పుడు కూడా, అస్కార్ దాకా వెళ్లిన క్రెడిట్‌ను తగ్గించడానికి అక్కడి మీడియా పనిగట్టుకుని మరీ అదే పనిగా నెగిటివ్ కథనాలు ప్రచురించింది.

ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ అంటేనే నెపోటిజం వర్సెస్ టాలెంట్ అనేలా ఉంటుంది. బాలీవుడ్‌లో కేవలం వారసులకే ఇంపార్టెన్స్ ఇస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి బయటి వ్యక్తులు కానీ, మన సౌత్ హీరోలు బాలీవుడ్‌లో ఎదిగితే వారు భరించలేరు.

అందుకే తెలుగు హీరోలను పొట్టివాళ్లని, మొరటువాళ్లని చెబుతూ తెలుగు హీరోల మార్కెట్ డౌన్ చేయడానికి ఎప్పటికప్పుడు బాలీవుడ్ మాఫియా చూస్తూనే ఉంటుంది. అయితే బాలీవుడ్ తన విష సంస్కృతిని మార్చుకోకపోతే, భవిష్యత్తులో ఆ ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button