Atlee, Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. అట్లీతో చేస్తున్న గ్లోబల్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Atlee, Allu Arjun: అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు అల్లు అర్జున్ నటన తోడైతే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ రావడం ఖాయం.

Atlee, Allu Arjun
టాలీవుడ్ అగ్ర హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు తాత్కాలికంగా AA22 అనే పేరు పెట్టారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా గురించి ఇప్పుడు ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి . సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమా కథ చాలా వెరైటీగా ఉండబోతోందని టాక్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ , యాక్షన్ ఫాంటసీ కథ అని సమాచారం. అంతేకాదు ఇందులో అల్లు అర్జున్ ఏకంగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. హీరోయిన్ల విషయంలో కూడా అట్లీ చాలా కేర్ తీసుకుంటున్నారు. దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్ , జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా టైటిల్ , టీజర్ ను ఏప్రిల్ నెలలో అనౌన్స్ చేయబోతున్నారట. అల్లు అర్జున్ (Allu Arjun)పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ టీజర్ ను వదిలే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత రాబోతున్న సినిమా కావడంతో దీనిపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు అల్లు అర్జున్ నటన తోడైతే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ రావడం ఖాయం.



