Bigg Boss : బిగ్ బాస్ తెలుగు 9..ఈసారి రెట్టింపు ఎంటర్టైన్మెంట్..!

Bigg Boss:సెప్టెంబర్ 7న రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Bigg Boss

తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించే రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss) తెలుగు 9 కొత్త సీజన్‌తో అలరించడానికి సిద్ధమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా, ఈసారి సరికొత్త డ్రామా, థ్రిల్, ఊహించని మలుపులతో రాబోతోంది. సెప్టెంబర్ 7న రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ షో స్టార్ మా ఛానెల్‌లో అండ్ జియో సినిమా (Jio Cinema)లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సీజన్ ఇప్పటి వరకూ వచ్చిన వాటికి డిఫరెంట్‌గా ‘డబుల్ హౌస్’ కాన్సెప్ట్‌తో వస్తోంది. ఇది ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ హామీ ఇచ్చారు. మొదటిసారిగా, సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం పొందారు.

మెయిన్ సీజన్ ప్రారంభానికి ముందు, ‘బిగ్ బాస్(Bigg Boss)’ టీమ్ ‘అగ్నిపరీక్ష’ పేరుతో ఒక ప్రీ-షోను నిర్వహించింది. దీనికి యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేయగా, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు, విజేతలు బిందు మాధవి, నవదీప్, అభిజిత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ప్రీ-షోలో వివిధ రంగాల నుంచి వచ్చిన 45 మంది పోటీదారులు టాస్కులలో పాల్గొనగా, వారిలో 15 మందిని మెయిన్ షో కోసం ఎంపిక చేశారు. ఈ 15 మందిలో అనుష రత్నం, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖిత, డెమోన్ పవన్ వంటివారు ఉన్నారు. వీరు సెలబ్రిటీలతో పోటీపడి హౌస్‌లో తమ స్థానాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Bigg Boss

ఈసారి బిగ్ బాస్ హౌస్‌(Bigg Boss)లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీల జాబితా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్ట్‌లో దీపిక, దేబ్‌జాని, కావ్య, తేజస్విని, శివ కుమార్, రీతూ చౌదరి, కల్పిక గణేష్, సుమంత్ అశ్విన్, సాయి కిరణ్, ఎమ్యానుయెల్, సాకేత్ వంటి ప్రముఖులు ఉన్నారని సమాచారం. ఈ పేర్లతో పాటు, కొన్ని ఊహించని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి, ‘అగ్నిపరీక్ష’తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 9, డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో, సెలబ్రిటీలు మరియు సామాన్యుల మధ్య జరిగే పోరాటంతో సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమైంది. మరి ఈ సీజన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో, విజేతగా ఎవరు నిలబడతారో చూడాలి. ఆట మొదలు!

NTR: నా కొడుకులను హీరోలు చేయను..ఎన్టీఆర్

Exit mobile version