NTR: నా కొడుకులను హీరోలు చేయను..ఎన్టీఆర్
NTR: నేను ఒక నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్‌ను కూడా! అని చెప్పి తారక్ షాక్ ఇచ్చారు.

NTR
జూనియర్ ఎన్టీఆర్ (NTR)కేవలం బాక్సాఫీస్ వద్దే కాదు, మాటలతో కూడా అభిమానుల మనసులను గెలుచుకుంటారన్న విషయం తెలిసిందే. తాజాగే మరోసారి ఇదే ప్రూవ్ చేసుకున్నారు. నందమూరి కుటుంబ వారసత్వాన్ని మోస్తున్నా, తన పిల్లలైన అభయ్ మరియు భార్గవ్‌లను నటనలోకి బలవంతం చేయనని ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ నిర్ణయం ఎన్టీఆర్ లోని అసలైన విజన్‌ను చూపిస్తోందంటూ నందమూరి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన ఎన్టీఆర్, తాజాగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. “నేను ఒక నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్‌ను కూడా!” అని చెప్పి తారక్ షాక్ ఇచ్చారు. తనకు దొరికిన స్వేచ్ఛ వల్లే తను నటనను ఎంచుకున్నానని, అది ఎప్పుడూ తనపై రుద్దబడలేదని ఎన్టీఆర్ అన్నారు. తాను ఎంత ఎదిగినా, ఆ స్వేచ్ఛకు విలువ ఇస్తున్నారని ఈ మాటలు చెబుతున్నాయి. అందుకే తన పిల్లలకూ అదే స్వేచ్ఛను ఇవ్వాలనుకుంటున్నారు.

కొడుకులను సినీ రంగంలోకి తీసుకురావాలనే ఒత్తిడి చాలా స్టార్ ఫ్యామిలీస్‌లో ఉంటుంది. కానీ ఎన్టీఆర్(NTR) ఆలోచన డిఫరెంట్! “చరిత్రను పిల్లలపై రుద్దడం మంచిది కాదు. వారి సొంత ప్రయాణం కోసం నేను ఒక ఉదాహరణగా ఉండాలనుకుంటున్నాను. వారి ఇష్టాలు వారు ఎంచుకోవాలి. నేను వారికి అవకాశాలను మాత్రమే చూపిస్తాను. నిర్ణయం వారిదే! అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ మాటలు కేవలం అభిమానులకే కాదు, ప్రతి తండ్రికీ ఒక ఇన్స్పిరేషన్.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ (NTR)క్రేజ్ ఎంత పెరిగిందో ‘వార్ 2’ సినిమాతో తెలిసిపోయింది. హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇప్పుడు ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసం ప్రపంచమంతా వెయిట్ చేస్తోంది. ఆ తర్వాత ‘దేవర’ సీక్వెల్ కూడా ఉండనే ఉంది. ఎన్టీఆర్ ఎక్కడ అడుగు పెట్టినా రికార్డులే! ఇక ఆయన పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిత్వానికి, నిజమైన నాయకత్వ లక్షణాలకు నిదర్శనం.
2 Comments