Bigg Boss: బిగ్ బాస్ హౌస్ నుంచి దువ్వాడ మాధురి అవుట్.. మీమర్స్ ఎఫెక్ట్‌ వల్లేనా?

Bigg Boss: మిడ్ వీక్ ఓటింగ్‌లో ఆరో స్థానంలో ఉన్న మాధురి, వీకెండ్‌కు వచ్చేసరికి అనూహ్యంగా ఎలిమినేట్ కావడం హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

Bigg Boss

బిగ్ బాస్ (Bigg Boss)తెలుగు సీజన్ 9 మరింత ఉత్కంఠగా సాగుతోంది. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్‌ ఆటతీరును సమీక్షించారు. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ ప్రయాణంలో, ఈ వారం హౌస్ నుంచి ఊహించని విధంగా దువ్వాడ మాధురి అవుట్ అయ్యారు.

ఇప్పటివరకూ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారి జాబితాలో శ్రేష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్ ,ఫ్లోరా సైని ,శ్రీజ దమ్ము, రమ్య మోక్ష

భరణి శంకర్ (రీ-ఎంట్రీతో పర్మనెంట్ హౌస్‌మేట్‌గా మారారు). అయితే ప్రస్తుతం హౌస్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

కాగా ఎనిమిదో వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా..వారిలో తనూజ గౌడ, కల్యాణ్ పడాల, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్, రాము రాథోడ్, సంజన గల్రానీ, దువ్వాడ మాధురి ఉన్నారు.

Bigg Boss

ఓటింగ్ పోల్స్ ప్రారంభమైనప్పటి నుంచి కంటెస్టెంట్స్‌ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అయితే, వీకెండ్ వచ్చేసరికి గౌరవ్ గుప్తా, దువ్వాడ మాధురి చివరి రెండు స్థానాల్లో నిలిచారు. చివరికి, ఎలిమినేషన్ ప్రక్రియలో దువ్వాడ మాధురి హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే మిడ్ వీక్ ఓటింగ్‌లో ఆరో స్థానంలో ఉన్న మాధురి, వీకెండ్‌కు వచ్చేసరికి అనూహ్యంగా ఎలిమినేట్ కావడం హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

నిజానికి ఓటింగ్ చివరి స్థానంలో గౌరవ్ ఉన్నాడని భావించినా, అనూహ్యంగా మాధురి ఎలిమినేట్ కావడానికి ఒక ఫన్నీ కారణం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. భరణి శంకర్ ఎలిమినేట్ అయిన తర్వాత రీ-ఎంట్రీ ఇవ్వడం, అంతకుముందు హౌస్‌లో భరణి-మాధురి మధ్య జరిగిన సన్నివేశాలను మీమర్స్ ‘లవ్ రిలేషన్‌షిప్’, ‘రొమాంటిక్ యాంగిల్‌’లో పోస్ట్ చేసి వైరల్ చేయడమే ఇందుకు కారణమని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈ మీమ్స్ క్రియేటివిటీ ప్రభావం ఓటింగ్ పై పడి ఉండవచ్చని చెబుతున్నారు.

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అక్టోబర్ 12న ‘బిగ్ బాస్(Bigg Boss) 9 గ్రాండ్ లాంచ్ 2.O’ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాధురి, మొత్తం 22 రోజులు హౌస్‌లో ఉంది. వారానికి రెమ్యునరేషన్ సుమారు రూ. 40,000 ఇచ్చినట్లు సమాచారం..3 వారాలు హౌస్‌లో ఉన్నందుకు గాను, మాధురి దాదాపు రూ. 1,20,000 నుంచి రూ. 1,25,000 వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version