Winner: బిగ్ బాస్ 9 విన్నర్ అతనే.. గూగుల్ AI కూడా ఫిక్స్ అయిపోయింది..!
Winner:తనూజ తప్పు చేసినా పెద్దగా మందలించకపోవడంతో ప్రేక్షకులు ఆమెను 'బిగ్ బాస్ ముద్దుబిడ్డ'గా పిలుచుకున్నారు. దాంతో, ఆమే విన్నర్ అవుతుందని అందరూ ఫిక్స్ అయ్యారు.
Winner
బిగ్ బాస్ సీజన్ 9 షో చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే (Finale) జరగనుండటంతో, ఈ సీజన్ టైటిల్ విజేత(Winner) ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో బాగా పెరిగింది. ప్రస్తుతం హౌస్‌లో కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి, డీమాన్ పవన్ ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి, సీరియల్ బ్యూటీ తనూజ విన్నర్ అవుతుందని ప్రేక్షకులు ఊహించారు. అందుకు తగ్గట్టే, బిగ్ బాస్ కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చాడని, ఆమె తప్పు చేసినా పెద్దగా మందలించకపోవడంతో ప్రేక్షకులు ఆమెను ‘బిగ్ బాస్ ముద్దుబిడ్డ’గా పిలుచుకున్నారు. దాంతో, తనూజనే విన్నర్ అవుతుందని అందరూ ఫిక్స్ అయ్యారు.
అయితే, ఇప్పుడు ఊహించని విధంగా రేసులోకి కళ్యాణ్ పడాల వచ్చాడు. అతను టాస్క్‌లలో సత్తా చూపిస్తూ, ఆట పరంగా బాగా ఇంప్రూవ్ (Improved) అయ్యాడు. దీంతో ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు కళ్యాణ్ విన్నర్ అవుతాడు అని కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం కళ్యాణ్ విన్నర్(Winner) అవుతాడు అని కేవలం ప్రేక్షకులే కాదు, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కూడా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.
‘బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు?’ అని గూగుల్ AI ని అడిగితే, అది ‘కళ్యాణ్ పడాల’ అని చెప్పింది.
రన్నర్ ఎవరు అని అడిగితే, ‘తనూజ పుట్టస్వామి’ అని గూగుల్ AI పేర్కొంది.
ఇప్పటికే కళ్యాణ్ పడాల మొదటి ఫైనలిస్ట్‌గా నిలవగా, ప్రస్తుతం సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్క్‌లు జరుగుతున్నాయి. మరి గూగుల్ AI చెప్పిన ఈ అంచనా నిజమవుతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.



