Shrashti Verma: బిగ్‌బాస్‌లో మొదటి వారం ఊహించని ట్విస్ట్.. శ్రష్టి వర్మ ఎలిమినేషన్ ఎందుకు?

Shrashti Verma: నాగార్జున హోస్ట్‌గా మొదలైన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 మొదటి వారం ఎలిమినేషన్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు రావడం ప్రేక్షకులకు, కంటెస్టెంట్లకు ఒక షాక్‌లా అనిపించింది.

Shrashti Verma

బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కలలోనైనా కనీసం కొన్ని వారాలైనా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రేక్షకుల తీర్పు, ఓటింగ్ ఫలితాలు కొన్నిసార్లు అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. అదే బిగ్‌బాస్ రియాలిటీ షో యొక్క ప్రధాన ఆకర్షణ. నాగార్జున హోస్ట్‌గా మొదలైన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 మొదటి వారం ఎలిమినేషన్‌లో అదే జరిగింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ(Shrashti Verma) హౌస్ నుంచి బయటకు రావడం ప్రేక్షకులకు, కంటెస్టెంట్లకు ఒక షాక్‌లా అనిపించింది.

ఈసారి తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌తో హౌస్ కొత్త ఉత్సాహంతో ప్రారంభమైంది. మొదటి వారం నామినేషన్లలో కొందరు ఆశించిన కంటెస్టెంట్స్‌తో పాటు, ఊహించని వారు కూడా నామినేట్ అయ్యారు. హౌస్‌లోకి అడుగుపెట్టేటప్పుడు శ్రష్టి “నా నిజమైన వ్యక్తిత్వాన్ని అందరికీ చూపిస్తా” అని చెప్పింది. ఆమె తన ఉత్సాహం, చురుకుదనం, డ్యాన్స్ స్కిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. మొదటి వారం టాస్క్‌లలోనూ చురుగ్గా పాల్గొంది. కానీ, చివరికి ఓటింగ్‌లో ఆమెకు అనుకున్నంత మద్దతు లభించలేదు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఎలిమినేషన్‌కు ముందు సోషల్ మీడియాలో, వివిధ ఫ్యాన్‌పేజీలలో జరిగిన చర్చలు, పోల్స్ అన్నీ వేరే విధంగా ఉన్నాయి. శ్రష్టి(Shrashti Verma) సేఫ్ జోన్‌లో ఉందని, మరొక కంటెస్టెంట్ బయటకు వెళ్లే అవకాశం ఉందని చాలామంది అంచనా వేశారు. ఈ అంచనాలను పూర్తిగా తారుమారు చేస్తూ, చివరి నిమిషంలో ఓటింగ్‌లో వచ్చిన మార్పులతో శ్రష్టి మొదటి ఎలిమినేటర్‌గా నిలిచారు.

Shrashti Verma

మొత్తానికి, శ్రష్టితక్కువ వ్యవధిలో తనదైన ముద్ర వేయడంలో విఫలమవ్వడం, ఇతర కంటెస్టెంట్స్‌తో పోటీ పడలేకపోవడం, సోషల్ మీడియా అంచనాలు వాస్తవ ఓటింగ్‌తో సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల ఆమె తొలి వారం ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తోంది.

ఇది కేవలం ప్రేక్షకులను మాత్రమే కాదు, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లను కూడా షాక్‌కు గురి చేసింది. మొదటి వారంలోనే తన ఆటను ముగించాల్సి రావడం ఆమెకు, ఆమె అభిమానులకు నిరాశ కలిగించినా కూడా.. ఈ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించిందని చెప్పొచ్చు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా పాజిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ అనుకోని ఎలిమినేషన్(unexpected elimination)తో బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్ మొదటి వారమే ఒక పెద్ద మలుపు తిరిగింది.

Black holes: విశ్వ చరిత్రను మార్చే సంఘటన.. బ్లాక్ హోల్స్ అంతం అవుతాయా?

Exit mobile version