Chiranjeevi: రాజకీయ విమర్శలపై చిరు క్లాస్ రెస్పాన్స్
Chiranjeevi: రాజకీయాలనుంచి తప్పుకున్నాక కూడా, కొందరు నాయకులు చిరంజీవిని వదలడం లేదు. సోషల్ మీడియాలో తిట్లు, దూషణలు, అవాకులు చవాకులు .

Chiranjeevi
రాజకీయాలనుంచి తప్పుకున్నాక కూడా, కొందరు నాయకులు చిరంజీవి(Chiranjeevi)ని వదలడం లేదు. సోషల్ మీడియాలో తిట్లు, దూషణలు, అవాకులు చవాకులు . ఏమీ మిస్సవడం లేదు. కానీ చిరంజీవి మాత్రం ఒక్కటే ఫిలాసఫీ( philosophy)తో నడుస్తున్నారు. విమర్శలకి స్పందించాల్సిన అవసరం నాకు లేదు. నా పని నేనే చేసుకుంటాను. నేను చేసిన సేవలే నాకు రక్ష అంటూ కదులుతున్నారు.
నేను మాట్లాడనక్కర్లేదు… నా చేసిన పనే మాట్లాడుతుంది..ఈ ఒక్క మాట ఆయన యాటిట్యూడ్‌ను పూర్తిగా వివరిస్తుంది. ఎవరైనా ఎదురు మాట్లాడితే ప్రతిసారీ తిరిగి మాట్లాడాల్సిన అవసరం చిరంజీవికి లేదు. ఎందుకంటే అరిచే ప్రతి కుక్కకి రాళ్లు వేస్తే, మన దారి మనమే మర్చిపోతాం. అందుకే పని చేయాలి, స్పందించకూడదు. వివాదాల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ, సేవతో మానవత్వాన్ని తడిమే చిరంజీవి మైండ్‌సెట్… అదే ఆయనను మెగాస్టార్‌గా నిలిపిన నిజమైన శక్తి .

భారీ ఇమేజ్ ఉన్నా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చాలా సింపుల్ అన్న విషయం తెలిసిందే. తాజాగా చిరు మీడియాలో వేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ‘నేను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నా. ఎవరు నన్ను విమర్శించినా, సోషల్ మీడియాలో ఏవైనా కామెంట్లు చేసినా, వాటిని పట్టించుకోవాలనే అవసరం నాకు లేదు. నేను మాట్లాడాలనిపించడం లేదు. నా మంచే నా మాట అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
అంతేకాదు ఈ మాటలు చెప్పినప్పుడు, ఆయన జీవితంలో జరిగిన చిన్న సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒక మహిళ నన్ను విమర్శించిన నాయకుడ్ని నిలదీసింది. ఆమె చూపిన ప్రేమ నాకు శక్తిని ఇచ్చింది అన్నారు. అంటే తన బలమైన అభిమాన బలం, నిజమైన మనుషులతో ఉండడమే చిరంజీవికి ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని చెప్పకనే చెప్పారు.
చిరు రోడ్ షోలలో మాట్లాడడం కన్నా, ఆయన నడిచే మార్గమే చిరంజీవిని ప్రత్యేకంగా నిలబెట్టింది. బ్లడ్ బ్యాంక్,ఎంతోమంది ఆర్టిస్టులకు సహాయాలు, సేవా కార్యక్రమాలు వీటన్నిటిలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఎంతో మంది హీరోలకు చిరు ఇన్‌స్పిరేషన్ అయితే ..అనేక మంది యువత ఆయనను చూసి మాటల్లో కాకుండా, నిజంగా పని చేయడం నేర్చుకోవాలనే తత్వాన్ని నేర్చుకోవాలంటారు.