Mrunal Thakur: అవును.. మృణాల్ నిజమే చెప్పింది..!
Mrunal Thakur: కొన్ని సినిమాలు ఫెయిలవ్వడానికి అసలు కారణం నెగిటివ్ రివ్యూలే: మృణాల్ ఠాకూర్

Mrunal Thakur
ఇప్పుడు ఒక సినిమా థియేటర్లోకి రాగానే… స్క్రీన్ మీద నటులు కన్నా, మొబైల్ స్క్రీన్‌లో రివ్యూ మేకర్లే ముందుగా కనిపిస్తున్నారు. సినిమా చూడకుండానే.. ట్విట్టర్ పోస్టులు, యూట్యూబ్ రివ్యూలు, ఇన్‌స్టా రీల్స్, న్యూస్ వెబ్సైట్ల హెడ్‌లైన్స్… బోర్, ఫ్లాప్, ఓవరాక్షింగ్,ఇదేం సినిమా, చెత్త యాక్షన్ అంటూ ముందే తీర్పు చెప్పేస్తున్నారు. అసలు ప్రేక్షకుడు సినిమా చూసేలోపే, ఫేక్ రేటింగ్‌లు ఇచ్చి దాన్ని ఖాళీ షెల్ఫ్‌లో పెట్టేస్తున్నారు.
ఈ రివ్యూల కల్లోలం మీద ఇప్పటికే చాలా మంది హీరోలు, డైరెక్టర్లు బాధ వ్యక్తం చేశారు. ఇప్పుడు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కూడా అదే విషయాన్ని మరోసారి రెయిజ్ చేశారు. ఆమె నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ రిలీజ్‌కి సంబంధించి ఓ ఫ్యాన్ ఇన్‌స్టాలో.. నేను నెగిటివ్ రివ్యూలు చూసి ఆ సినిమా చూడలేదండి” అని మెసేజ్ పెట్టాడు.
దానికి మృణాల్ (Mrunal Thakur)స్పందిస్తూ ..చాలా రివ్యూలు(Movie Review) సినిమాని తప్పుదారి పట్టిస్తున్నాయి. అందుకే రివ్యూలకన్నా, మీరే సినిమా చూసి ఓ నిర్ణయం తీసుకోండి. కొన్ని సినిమాలు ఫెయిలవ్వడానికి అసలు కారణం నెగిటివ్ రివ్యూలే అని కుండబద్ధలు కొట్టేసారు. ఆవేదనతో చెప్పిందో.. వాస్తవాన్ని అర్ధం చేసుకుని చెప్పిందో కానీ మృణాల్ చెప్పింది హండ్రెడ్ పర్సంట్ నిజం.

ఇప్పుడే మరో ప్రశ్న తలెత్తుతుంది. రివ్యూకు ముందు సినిమా చూసే అవకాశం లేకుండా మిగిలిపోతున్న ప్రేక్షకుల పరిస్థితి ఏంటి అని.
అంటే, నిజంగా ఎంతో మంది ప్రేక్షకులు రివ్యూలు చూసే.. సినిమా చూడాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. వాళ్ల అభిప్రాయాల మీద ఎవరో చేస్తున్న ఫేక్ కామెంట్ల ప్రభావం పడిపోతుంది. మంచి సినిమా అయినా నెగిటివ్ ట్యాగ్లలో కూరుకుపోతుంది.
ఒక్కోసారి టైటిల్‌నే చూడగానే అసలు ఇంట్రస్ట్ పోతుంది. ఓవర్ యాక్టింగ్ షో!, డిజాస్టర్ టాక్! లాంటి హెడ్డింగ్స్‌తో పబ్లిక్ మతిపోగొడుతున్నారు. సినిమా ఎలా ఉందో కంటే… ఎవడెవడు ఏమన్నాడో చూసి ప్రేక్షకుడు వెనక్కి తగ్గిపోతున్నాడు.
ఇది కేవలం ఒక్క సినిమాకు కాకుండా, మొత్తం ఇండస్ట్రీకి సమస్యగా మారుతోంది. ఫ్రీగా వాయిస్ వినిపించే హక్కు అందరికీ ఉన్నా… అది వాస్తవంగా ఉండాలి. లేదంటే, తప్పుడు ట్యాగ్‌లతో సినిమాని కిందకు లాగడం మానుకోవాలి. మృణాల్ నుంచి వచ్చిన మాటే ఇప్పుడు ఇదే నిజం అని రీ సౌండ్లు చేస్తోంది.