Naari Naari Naduma Murari :నారీ నారీ నడుమ మురారి అన్ని వయసుల వారినీ మెప్పించిందా?
Naari Naari Naduma Murari : నటనలో శర్వానంద్ చాలా మంచి కామెడీ మార్క్ ను బలంగా వేశాడు. కొన్ని భావోద్వేగాలను కూడా డైలాగు మాడ్యులేషన్లో చూపించాడు.
Naari Naari Naduma Murari
కొన్ని సినిమాలు సీటు ఎడ్జ్ భయం థ్రిల్లింగ్ ను కలిగిస్తాయి.కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే సీట్ ఎడ్జ్ కామెడీ తో థియేటర్స్ ను హోరెత్తిస్తాయి అంటే అతిశయోక్తి కాదేమో. అలా మొదట సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకు ప్రతీ సన్నివేశం లో వినోదం కి c/o అడ్రస్ ఈ నారీ నారీ నడుమ మురారి (Naari Naari Naduma Murari ). కథ విషయానికి వస్తే ఒక బంధం కలుపుకోవడానికి ,నిలుపుకోవడానికి ఒక అబద్దంను దాయటానికి చేసే చిత్ర విచిత్ర విధి విన్యాసాల చిత్ర మాలిక.
నటనలో శర్వానంద్ చాలా మంచి కామెడీ మార్క్ ను బలంగా వేశాడు. కొన్ని భావోద్వేగాలను కూడా డైలాగు మాడ్యులేషన్లో చూపించాడు.కామెడీ యాక్టర్ సుదర్శన్ సినిమా ఇంచుమించు హీరో పాత్ర వెంబడి ఉండటం వలన తన డైలాగ్ లతో నవ్వులు పూయించాడు.
నటుడు సంపత్ ,నరేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటాయి.ప్రేమికులను కలిపే పాత్ర లో సత్య కామెడీ & ఉత్తమ్ శిష్యుడు పాత్ర లో వెన్నెల కిషోర్ పాత్రలు కథలో భాగం గా అంతర్లీనం అవ్వటం వల్ల హాస్యం చాలా సహజం గా పండింది.ప్రేక్షకులు ఈ రెండు పాత్రలకు ఎంతలా లీనం అయ్యారు అంటే డైలాగ్స్ రాకుండానే వీరు స్క్రీన్ పై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు.
హీరోయిన్లు సంయుక్త & సాక్షి ఇద్దరికీ కథలో ప్రాధాన్యత కూడిన పాత్రలు ఇచ్చారు.చక్క గా పాత్ర పరిధిలో నటించి మెప్పించారు.విశాల్ చంద్ర శేఖర్ సంగీతం కూడా ఇదే విధం గా కథను నడుపుతాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కామెడీ టైమింగ్ ను మిస్ కాకుండా ఇచ్చారు.కృత్రిమ సంగీతం కి చోటు లేని సినిమా ఇది.
నారీ నారీ నడుమ మురారి (Naari Naari Naduma Murari ) సినిమాకి ప్రధాన బలం సంభాషణలు.రచయితలు రామ్ & భాను & నందు త్రయం విశ్వ రూపం చూపించి హిలేరియస్ కామెడీ కి మారు పేరులా నిలిచారు. సీరియస్ గా మలిచిన సునీల్ పాత్ర నుండి కూడా కామెడీనీ క్రియేట్ చేయడం వీరి కలంకి కామెడీ సిరా ఎంత ఉందో తెలుస్తుంది.
సినిమా లిమిటెడ్ లొకేషన్లో జరగడం వలన ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభ చాలా సహజత్వంగా ఉంది. ఫోటోగ్రఫీ మాత్రం కన్నులకు విందులా చాలా తాజా ధనం కనిపిస్తుంది. ముఖ్యంగా కేరళ లవ్ ఎపిసోడ్ ట్రాక్ లో విజువల్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి.కొరియోగ్రఫీ లో ఎక్కడ చిందర చిల్లర వింత పోకడ ల స్టెప్స్ జోలికి వెళ్లకుండా స్టోరీ టెల్లింగ్ పద్ధతి కనిపిస్తుంది.

డైరెక్టర్ రామ్ ఎంచుకున్న కథ & నడిపిన విధానం చూస్తే త్రివిక్రమ్ ను మించేలా ఉన్నాడు అనిపిస్తుంది.ఎంచుకున్న పాత్రల తో పాటు ,తాను ఎంచుకున్న టెక్నికల్ టీమ్ ను కూడా 100 % కథ ,కథనంను ముందుకు కామెడీ డోస్‌తో ముందుకు తీసుకువెళ్లడంలో చాలా ఉపయోగించారు.షాట్ డివిజన్ లో కనిపించే ప్రతి కామెడీ రెస్పాండ్ రియాక్షన్ ను స్క్రీన్ పై చూపడంలో ఎడిటర్ మార్క్ చాలా ఉపయోగపడింది.ప్రతి సన్నివేశం ను రీజనింగ్ తో రాసుకోవడం లో కామెడీలో ఎగతాళి కామెడీ ఉండదు.
కొన్ని సన్నివేశాల్లో భలే భలే మగాడివోయ్ , పెళ్లాం ఊరిళితే ఛాయలు కనిపించినా సరే వెంటనే డైరెక్టర్ సమయస్పూర్తి తో కథనంను ప్రతీ పది నిమిషాలకు ఒక మలుపు తిప్పుతూ హాస్య చిత్రాల్లో కూడా థ్రిల్లింగ్ పంచవచ్చని విభిన్నంగా ఆలోచించాడు, ఆవిష్కరించాడు. ముఖ్యంగా సందర్భోచిత హాస్యంకి స్క్రీన్ ప్లే లోపెద్ద పీఠ వేసారు. ఇదే సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది.
కామెడీ సినిమాలో కూడా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే టెక్నిక్ ను వాడటం, పైగా రెండు లవ్ ఎపిసోడ్స్ ను కూడా అలా ట్రీట్ చేయడం సాహసం.ఈ స్క్రీన్ ప్లే & డైలాగ్స్ తో ఒక్క నిమిషం కూడా ప్రేక్షకుడిని కన్ను తిప్పకుండా అలరించారు.పై టీం అంతా వాళ్ళ క్రియేటివిటీ కి న్యాయం చేస్తే ఏ.కే ఎంటరటైన్మెంట్ వారు ఇచ్చిన నిర్మాణ విలువలు స్క్రీన్ పై ప్రతి ఫ్రేమ్ లో క్లీన్ & ఫ్రెష్ లా ఉంటుంది. కుటుంబం మొత్తం మొదటి నుంచి చివరి వరకు నవ్వుతూ హాయిగా బయటకు వచ్చే అన్ని వర్గాల, అన్ని వయస్సుల వారిని మెప్పించే మెచ్చే ,నచ్చే చిత్రం ఈ నారీ నారీ నడుమ మురారి (Naari Naari Naduma Murari ).
Review by Jainivas
Ravindra Jadeja : 2027 వరల్డ్ కప్ కష్టమే..రిటైర్మెంట్ ప్రకటించడమే మిగిలిందా ?




One Comment