NTR: ఎన్టీఆరే కాదు తారక్ ఫ్యాన్స్ కూడా సెన్సేషనే.. ఎందుకలా అంటారా?

NTR: ఒక చిన్న స్కెచ్ కోసం ఒక ఎన్టీఆర్ అభిమాని వెచ్చించిన మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

NTR

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్(NTR).. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన నటించిన సినిమాలే కాదు, ఆయన పట్ల అభిమానులకు ఉన్న ప్రేమ కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా, ఒక చిన్న స్కెచ్ కోసం ఒక ఎన్టీఆర్(NTR) అభిమాని వెచ్చించిన మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అరుదైన సంఘటన ఎన్టీఆర్ అభిమానుల శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.

సాధారణ పెన్సిల్ స్కెచ్.. భారీ ధరకు అమ్మకం..బ్యులా రూబీ అనే ఒక యువ తెలుగు ఆర్టిస్ట్ పెన్సిల్స్‌తో అద్భుతమైన స్కెచ్‌లు గీస్తుంది. తను గీసిన కళాఖండాలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటిని ఆసక్తి ఉన్న వారికి అమ్ముతుంటుంది. ఇటీవల, ఆమె జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ గీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ స్కెచ్‌లో ఎన్టీఆర్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, ఆయన కళ్ళలోని ఫైర్, జుట్టు… ఇలా ప్రతి చిన్న డీటెయిల్ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఈ స్కెచ్ వేసినప్పుడు తను ఊహించలేదు.. ఇది ఇంత పెద్ద సంచలనం సృష్టిస్తుందని.

ఈ స్కెచ్ వైరల్ అవ్వడంతో ఒక ఎన్టీఆర్(NTR) అభిమాని అమెరికా నుంచి బ్యులా రూబీకి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడు. ఆ స్కెచ్‌కు ఎంతైనా ధర చెల్లించి కొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఆ అభిమాని కోరిక మేరకు బ్యులా రూబీ ధర చెప్పగా, ఆ అభిమాని ఏ మాత్రం ఆలోచించకుండా ఆ డబ్బు చెల్లించాడు. ఆ మొత్తం ఎంతో తెలుసా? 1650 డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు లక్షా 45 వేల రూపాయలు.

ఈ విషయం స్వయంగా బ్యులా రూబీ తన సోషల్ మీడియాలో వెల్లడించింది. “ఇప్పటివరకు నేను గీసిన తెలుగు హీరోల స్కెచ్‌లలో ఇది అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. నా పెన్సిల్ ఆర్ట్ ఇంతకు అమ్ముడవుతుందని నేను అనుకోలేదు” అని సంతోషంగా చెప్పింది. ఈ స్కెచ్ అంత ఖరీదుకు అమ్ముడవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ కళను చూసి ఆశ్చర్యపోతున్నారు.దీంతో ఎన్టీఆర్ పట్ల ఫ్యాన్స్‌కు ఉన్న ఈ పిచ్చి అభిమానం నిజంగా అద్భుతం అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

Milk well: ఆ నీళ్లు తాగితే సర్వరోగాలూ మాయం..ఆ పాల బావి రహస్యమేంటి?

Exit mobile version