Nuvve Kavali:25 ఏళ్లు పూర్తి చేసుకున్న నువ్వే కావాలి.. అప్పట్లోనే రూ.24 కోట్ల గ్రాస్..
Nuvve Kavali: ఈ సినిమా కోసం ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబును, ఆ తర్వాత సుమంత్‌ను అనుకున్నారు. మహేష్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో, సుమంత్ బిజీగా ఉండటం వల్ల, చివరకు ఈ అవకాశం తరుణ్‌కు దక్కింది.

Nuvve Kavali
క్లాసిక్ హిట్ ‘నువ్వే కావాలి(Nuvve Kavali)’ సినిమాకి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, చాలా మందికి ఒక భావోద్వేగం (Emotion). నిర్మాతకు, దర్శకుడికి, హీరో, హీరోయిన్, సంగీత దర్శకుడు, రచయిత – ఇలా చిత్ర బృందంలోని ప్రతీ ఒక్కరికీ అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన యూత్ ఫుల్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఇది.
ఈ(Nuvve Kavali) సినిమా 2000 సంవత్సరం అక్టోబర్ 13న విడుదలై బిగ్గెస్ట్ హిట్ సాధించింది.కేవలం రూ 1.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, దాదాపు రూ. 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ సమయంలో ఈ విజయం ‘బాహుబలి’ రేంజ్ హిట్తో సమానమని చెప్పవచ్చు.3 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమాను వీక్షించారు, ఇది ఆల్ టైమ్ రికార్డ్.ఈ సినిమా 20 సెంటర్లలో 200 రోజులు, ఆరు సెంటర్లలో ఏకంగా 365 రోజులు ఆడింది. కొన్ని సెంటర్లలో 400 రోజులు కూడా ప్రదర్శితమై రికార్డ్ క్రియేట్ చేసింది.
దర్శకత్వం కె. విజయభాస్కర్, సంగీతం కోటి, రచన త్రివిక్రమ్ అందించారు. తరుణ్‌కు హీరోగా ఇది తొలి చిత్రం (బాలనటుడిగా అప్పటికే ఆయన 30 సినిమాలు చేశారు). హీరోయిన్‌గా రిచా పల్లోడ్ నటించారు.నిజానికి, ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘నిరం’ చిత్రానికి రీమేక్. అయితే, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేయడంతో, ఒరిజినల్ కంటే తెలుగులోనే భారీ సక్సెస్ సాధించింది.

ఈ ((Nuvve Kavali))సినిమా కోసం ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబును, ఆ తర్వాత సుమంత్‌ను అనుకున్నారు. మహేష్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో, సుమంత్ బిజీగా ఉండటం వల్ల, చివరకు ఈ అవకాశం తరుణ్‌కు దక్కింది. ఈ సినిమా హిందీలో ‘తుఝే మేరీ కసమ్’ పేరుతో రీమేక్ అయింది. ఇందులో రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా నటించి మంచి విజయాన్ని సాధించారు.
మ్యూజిక్ డైరెక్టర్ కోటి తన సంగీతంతో సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. యూత్ మరియు ఎమోషనల్ అంశాలను కలిపి అందించిన ఆయన పాటలు అద్భుతం. ముఖ్యంగా, “అనగనగా ఆకాశం ఉంది,” “ఎక్కడ ఉన్న పక్కన నువ్వే,” “కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు” వంటి పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్లే.
త్రివిక్రమ్ తన మాటలతో మంత్రం వేశారు. సన్నివేశానికి తగిన పదునైన, భావోద్వేగమైన సంభాషణలు అందించి, తన కలం బలాన్ని రుచి చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.
ఈ సినిమా కేవలం కాసుల వర్షం కురిపించడమే కాక, అవార్డులనూ గెలుచుకుంది.2000 సంవత్సరానికి గాను ఈ చిత్రం ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. అలాగే, ఉత్తమ నటుడు (తరుణ్), ఉత్తమ నటి (రిచా పల్లోడ్), ఉత్తమ దర్శకుడు (కె. విజయభాస్కర్), ఉత్తమ రచయిత (త్రివిక్రమ్), ఉత్తమ సంగీత దర్శకుడు (కోటి) లకు నంది అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా, ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడు మిస్ అవకుండా చూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు.