Just EntertainmentLatest News

OG :పవన్ కళ్యాణ్ ‘ఓజీ’..ఓవర్సీస్‌లో రికార్డుల వేట మొదలయిపోయింది..!

OG :డల్లాస్‌లోని ఓ థియేటర్‌లో ఏకంగా 38 షోలకు టికెట్లు విడుదల చేయగా, కేవలం నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘ఓజీ’ ( OG) చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఎంతగా ఉన్నాయో చెప్పడానికి ఓవర్సీస్‌లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్సే నిదర్శనం.

వినాయక చవితి సందర్భంగా, నార్త్ అమెరికాలో కేవలం రెండు థియేటర్లలోనే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టగా, వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి.

బుకింగ్స్ రికార్డులు మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. డల్లాస్‌లోని ఓ థియేటర్‌లో ఏకంగా 38 షోలకు టికెట్లు విడుదల చేయగా, కేవలం నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ 38 షోల నుంచే ఏకంగా 50 వేల డాలర్లు వచ్చాయి.

సుమారు 2,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని సమాచారం. అదేవిధంగా, ఆస్టిన్‌లో మొదలుపెట్టిన రెండు షోలకు కూడా ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు థియేటర్ల నుంచి కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు 60 వేల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

ఈ రేంజ్ ట్రెండ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘కల్కి’, ‘దేవర’, ‘పుష్ప 2’ మూవీలకు కూడా లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘దేవర’ మూవీకి 19 లొకేషన్లలో 52 షోలకు 75 వేల డాలర్లు వచ్చాయి. ‘కల్కి’కి 100కు పైగా షోలకు లక్ష డాలర్ల గ్రాస్ వచ్చింది.

కానీ, ‘ఓజీ’కి కేవలం రెండు థియేటర్ల నుంచే ఇంత భారీ వసూళ్లు రావడంతో ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇదే రేంజ్‌లో సెప్టెంబర్ 29న పూర్తిస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే, ఓవర్సీస్‌లో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

దీంతో ఓజీ (OG)మూవీ కల్కి రికార్డు బ్రేక్ చేస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2లోపు ‘ఓజీ’ హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఊపు ఇదే విధంగా కొనసాగితే, ‘కల్కి’ (3.9 మిలియన్ డాలర్లు) ప్రీమియర్ షో రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

OG
OG

ప్రస్తుతం ‘కల్కి’,దేవర’ మూవీ టైమ్‌లో నార్త్ అమెరికాలో ఐమాక్స్ షోలు భారీగా షెడ్యూల్ అయ్యాయి. అయితే, ‘ఓజీ’కి ఐమాక్స్ షోలు షెడ్యూల్ అవుతాయా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ఐమాక్స్ షోలు కూడా షెడ్యూల్ అయితే, ‘ఓజీ’ ఓవర్సీస్‌లో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button