OTT :ఈ వీకెండ్ ఓటీటీలో పండగే..బీ రెడీ

OTT :ప్రతీ వారంలాగే ఈ వీకెండ్ కూడా ఓటీటీ ప్రేక్షకులు కొత్త కంటెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

OTT :ప్రతీ వారంలాగే ఈ వీకెండ్ కూడా ఓటీటీ ప్రేక్షకులు కొత్త కంటెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇంట్లో బిజీగా ఉండడమో, ఆఫీస్‌లో సెలవులు దొరక్కపోవడమో లాంటి కారణాలతో థియేటర్లలో మిస్ అయిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికరమైన కంటెంట్ ఉన్న మూవీస్ ఓటీటీలోకి వస్తున్నాయి. దీంతో మూవీ లవర్స్‌కు ఈ వీకెండ్ నిజంగా ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. ఈ నెల 18న వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో (OTT Platforms) విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల ఏమున్నాయో చూద్దాం.

ఈ వీకెండ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మూవీలు..

1. కుబేర (Kuberaa Movie)-థియేటర్లలో దుమ్మురేపి, ఇప్పుడు మీ స్క్రీన్‌పై..

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

స్ట్రీమింగ్ తేదీ: ఈ నెల 18

దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించిన ‘కుబేర’ చిత్రం జూన్ 20న భారీ అంచనాలతో విడుదలైంది. మొదటి ఆట నుండే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్లలో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తూనే ఉందంటే, ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది థియేటర్లలో మిస్ అయిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు మీ ఇంట్లోకే వచ్చేస్తోంది. చక్కటి స్టోరీ,హార్టి టచింగ్ సెంటిమెంట్ సీన్స్‌తో అలరించే ఈ మూవీని హాయిగా చూసేయండి.

2. భైరవం (Bhairavam Movie) – పక్కా యాక్షన్, పక్కా థ్రిల్..

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జీ5 యాప్ (Zee5 App)

స్ట్రీమింగ్ తేదీ: ఈ నెల 18

మంచు మనోజ్ (Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ (Nara Rohit) వంటి ప్రముఖ తారలు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అయినప్పటికీ, కచ్చితంగా చూడాల్సిన సినిమానే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గరుడన్’ (Garudan) అనే మూవీకి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులోనే మరింత పకడ్బందీగా, ఆకట్టుకునేలా తీశారని టాక్ ఉంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఇది మంచి కిక్ ఇస్తుంది.

3. భూతిని (Bhootini Movie) – సస్పెన్స్, థ్రిల్‌తో కూడిన హారర్ ట్రీట్..

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జీ5 యాప్ (Zee5 App)

స్ట్రీమింగ్ తేదీ: ఈ నెల 18

‘నాగిని’ సీరియల్ ఫేమ్ మౌని రాయ్ , బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మెయిన్ రోల్‌లో నటించిన ‘భూతిని’ సినిమా థియేటర్లలో యావరేజ్ రేంజ్‌లో ఆడింది. అయితే, ఓటీటీలో ఈ హారర్ థ్రిల్లర్ జానర్‌కు మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం కూడా జీ5 యాప్‌లోనే ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే, మంచి టైమ్ పాస్ అందించే సినిమాగా ఇది మిమ్మల్ని పక్కా ఎంటర్టైన్ చేస్తుంది.

వెబ్ సిరీస్‌ల ఫ్యాన్స్ కోసం..

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ఫ్రాగ్రంట్ పవర్ సీజన్ 1’ తో పాటు పలు ఆంగ్ల సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. ఇవి పెద్దగా పాపులర్ సినిమాలు కానప్పటికీ, కొత్త కంటెంట్ చూడాలనుకునే వారికి ఒక ఫ్రెష్ ఆప్షన్.

హాట్‌స్టార్ యాప్‌లో ‘ది స్టార్ ట్రెక్ సీజన్ 3’ అనే వెబ్ సిరీస్, అలాగే ‘స్పెషల్ జీపీఎస్ సీజన్ 2’ (Special GPS Season 2) వెబ్ సిరీస్‌లు కూడా వస్తున్నాయి. గత సీజన్‌లకు సూపర్ రెస్పాన్స్ వచ్చినందున, ఈ సిరీస్‌లను మొదటి సీజన్ నుండి చూసి మజా చేయండి. ఈ రెండు సిరీస్‌లు కూడా ఈ నెల 18న విడుదల కాబోతున్నాయి.

ఈ వీకెండ్, మీ ఇంటిని ఒక ప్రీమియం థియేటర్‌గా మార్చేసుకోండి. నచ్చిన సినిమాలు, సిరీస్‌లతో ఫుల్ ఎంజాయ్ చేసేయండి.

 

Exit mobile version