Upasana:మెగా ఫ్యాన్స్‌కి మెగా థాంక్స్.. వైరల్ అవుతోన్న ఉపాసన ఎమోషనల్ వీడియో
Upasana: తమ కుటుంబంపై చూపిస్తున్న అభిమానుల ప్రేమాభిమానాలను చూసి తన హృదయం ఉప్పొంగిపోతోందంటూ ఫ్యాన్స్‌కు , డాక్టర్ బృందానికి ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు.
Upasana
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన కొణిదెల దంపతులు జనవరి 31న కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఉపాసన కొణిదెల.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ హృదయాలను హత్తుకుంటోంది. 2012లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు పదేళ్ల తర్వాత క్లీంకార జన్మించగా, ఇప్పుడు కవలల రాకతో ఆ కుటుంబం పరిపూర్ణమైంది. ఉపాసన (Upasana)కేవలం మెగా కోడలిగానే కాకుండా అపోలో చారిటీ విభాగానికి వైస్ చైర్ పర్సన్‌గానూ పని చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు.
మొదటి బిడ్డ క్లీంకార తర్వాత, రెండోసారి ఒక బాబు, ఒక పాప పుట్టడంతో మెగా కుటుంబంలో ఆనందం డబుల్ అయింది. ఈ అపురూపమైన ప్రయాణానికి సంబంధించిన మధుర క్షణాలను వీడియో రూపంలో పంచుకుంటూ..తాజాగా ఉపాసన (Upasana)ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబంపై చూపిస్తున్న అభిమానుల ప్రేమాభిమానాలను చూసి తన హృదయం ఉప్పొంగిపోతోందంటూ ఫ్యాన్స్‌కు , డాక్టర్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాసన షేర్ చేసిన ఈ వీడియోలో..సీమంతం వేడుకల నుంచి అపోలో హాస్పిటల్లో డెలివరీకి ముందు డాక్టర్లు చేసిన ఏర్పాట్లు, తీసుకున్న జాగ్రత్తల వరకు అన్నీ ఉన్నాయి. కవలలు పుట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతోషం, హాస్పిటల్ బయట అభిమానులు చేసిన సంబరాలు.. ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీనిలో విశేషమేమిటంటే, క్లీంకార పుట్టిన గదిలోనే రెండోసారి కూడా డెలివరీ జరిగిందని, ఉపాసన చాలా ప్రశాంతంగా ఉన్నారని వైద్యులు చెప్పగా.. ఈ దృశ్యాలను చూస్తున్నప్పుడల్లా తన మనసు ఆనందంతో నిండిపోతోందని ఉపాసన చెప్పుకొచ్చారు.
మెగా అభిమానుల ప్రేమ, అపోలో హాస్పిటల్ సిబ్బంది చూపించిన కేర్ మర్చిపోలేనని ఉపాసన అన్నారు. “ఈ ప్రేమకు, పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కుటుంబ సభ్యులు నిజంగా అదృష్టవంతులు. రామ్ చరణ్ అభిమానులకి డబుల్ థాంక్స్. మీరు మా పిల్లలకు కూడా ఎప్పుడూ రక్షణగా ఉంటారని ఆశిస్తున్నా. వారి భద్రతను మీరు గౌరవిస్తారని నమ్ముతున్నా” అంటూ ఆమె ఎమోషనల్‌గా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి లాగే రామ్ చరణ్ కి కూడా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలగడం పట్ల మెగా అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOU
My family is truly blessed.
Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Dice games are surprisingly complex when you start looking at probabilities! Thinking about account security, like with a smooth registration process at jl78 download, is also key for enjoying the experience responsibly. Great post!