Just EntertainmentLatest News

Vishvambhara: ఆగస్టు 21న ‘విశ్వంభర’ మెగా బ్లాస్ట్..ఏంటా స్పెషల్?

Vishvambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్-అవైటెడ్ సోషియో-ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’ గురించి ఆయన స్వయంగా ఒక స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Vishvambhara

చిరంజీవి ఫ్యాన్స్‌కి ఇది ఒక క్రేజీ అప్‌డేట్! మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్-అవైటెడ్ సోషియో-ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర(Vishvambhara)’ గురించి ఆయన స్వయంగా ఒక స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. చాలామందిలో ఈ సినిమా రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతుందని ఉన్న క్వశ్చన్‌కు చిరు క్లారిటీ ఇచ్చారు.

విశ్వంభర (Vishvambhara) సినిమా ఆలస్యం అవడానికి ప్రధాన కారణం దాని VFX. సినిమా సెకండ్ హాఫ్‌లో చాలావరకు గ్రాఫిక్స్ మీద డిపెండ్ అవుతుందని, అందుకే ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా, ఒక పర్ఫెక్ట్ సినిమాను ఆడియన్స్‌కి అందించాలనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు చిరంజీవి వివరించారు. ఈ సినిమా ఒక అద్భుతమైన చందమామ కథలాగా ఉంటుందని, చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ కచ్చితంగా అలరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉంది.

ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న క్షణం రానే వచ్చింది! ఆగస్టు 21 సాయంత్రం 6:06కు ఈ సినిమా గ్లింప్స్‌ను ‘మెగా బ్లాస్ట్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఫ్యాన్స్‌కి ఒక అదిరిపోయే ట్రీట్‌లా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో చిరంజీవి సరసన హీరోయిన్స్గా త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. కునాల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు, బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్ ఒక స్పెషల్ సాంగ్లో మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేశారు. వంద మంది డ్యాన్సర్లతో ఈ సాంగ్‌ను పిక్చరైజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్లలో జోష్ నింపడం ఖాయం.ఇక ఈ సినిమా 2026 సమ్మర్లో ప్రేక్షకులను అలరించడానికి రానుంది.

World:ఒకవైపు యుద్ధాలు..మరోవైపు దౌత్యం: ప్రపంచం ఏ దిశగా పయనిస్తోంది?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button