Trump: షట్ డౌన్ దెబ్బకు అమెరికా కుదేలు.. త్వరలోనే ముగుస్తుందంటున్న ట్రంప్
Trump: సుమారుగా 4లక్షల 20వేల మంది జీతం లేకుండా పనిచెయ్యాల్సి వచ్చింది. అలాంటిది 41రోజులపాటు షట్‌డౌన్ కొనసాగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
Trump
అగ్రరాజ్యం పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదు. ముఖ్యంగా ట్రంప్ (Trump)రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఫుల్ బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వివాదాస్పద నిర్ణయాలతో ప్రజల్లో అసంతృప్తి మూటగట్టుకున్న ట్రంప్(Trump) కు షట్ డౌన్ ఎఫెక్ట్ కూడా గట్టిగానే తగిలింది. అమెరికాకు షట్‌డౌన్ కొత్తేమీ కాదు. అయితే ఇంత సుదీర్ఘంగా సాగడం మాత్రం ఇదే తొలిసారి. ట్రంప్ హయాంలోనే అంటే 2018-19లో 35 రోజుల పాటు షట్‌డౌన్ జరిగింది. అప్పుడు 8 లక్షల మంది షట్‌డౌన్‌తో తీవ్రంగా ప్రభావితమయ్యారు.
సుమారుగా 4లక్షల 20వేల మంది జీతం లేకుండా పనిచెయ్యాల్సి వచ్చింది. అలాంటిది 41రోజులపాటు షట్‌డౌన్ కొనసాగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. షట్‌డౌన్ ఎఫెక్ట్‌తో రెండు రోజుల్లో 14వందలకు పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. షట్‌డౌన్ నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎయిర్ ట్రాఫిక్‌ను తగ్గించారు.
దీంతో అగ్రరాజ్యంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలు మందగించాయి. ఈ పరిణామంతో అమెరికాలో పర్యాటక రంగానికి పెద్ద దెబ్బ పడింది. ఈ పరిణామాలతో అక్కడిప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది.

షట్‌డౌన్ కారణంగా అమెరికాకు ఆర్థికంగా 15 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగింది. గతంలో షట్‌డౌన్ కారణంగా 11 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగింది. స్టాక్ మార్కెట్లు కూడా దారుణంగా ప్రభావితమయ్యాయి. 8 లక్షలకు పైగా ఫెడరల్ ఉద్యోగులు ఇంట్లో ఉండాల్సి వస్తోంది. 14లక్షలమంది జీతం లేకుండానే పనిచేయాల్సి వస్తోంది. నేషనల్ పార్క్స్ అన్నీ మూతపడ్డాయి. సుమారు 4 లక్షల మంది పాస్‌పోర్ట్-వీసా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 4 లక్షలకు పైగా అమెరికా పౌరులు విదేశాల్లో చిక్కుకున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే సుదీర్ఘ షట్‌డౌన్ అమెరికన్లకు అడుగడుగునా కష్టాలు చూపిస్తూనే ఉంది.
ఈ క్రమంలో షట్‌డౌన్ ముగింపుపై ట్రంప్(Trump) కీలక ప్రకటన చేశారు.ప్రభుత్వ షట్‌డౌన్ త్వరలోనే ముగుస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు ప్రకటించారు.అయితే ఖైదీలకు, ఇల్లీగల్స్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు తాను ఒప్పుకోనని, ఈ విషయాన్ని డెమొక్రాట్లు అర్ధం చేసుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేయడానికి కొన్ని నిమిషాల ముందే ప్రభుత్వ షట్‌డౌన్‌ను ఆపే దిశగా అడుగులు పడ్డాయి.
రిపబ్లికన్‌ల డిమాండ్ ప్రకారం ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలపై ఓటింగ్‌కు హామీ ఇస్తే.. జనవరి చివరి వరకు నిధులను పొడిగించేందుకు మితవాద డెమొక్రాట్‌ల బృందం తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. విమానాల రద్దు, ఆహార సహాయం నిలిపివేత, ఫెడరల్ ఉద్యోగుల జీతాల కొరత తదితర తీవ్ర పరిణామాలకు అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నారు.
అయితే ఈ ఒప్పందంపై డెమొక్రటిక్ పార్టీలో తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో సెనేట్‌లో బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. బిల్లు పాస్ అయితే నవంబర్ 12 నుంచి నిధులు అందుబాటులోకి వస్తాయి. అయినప్పటికీ అమెరికాలో సాధారణ పరిస్థితులు రావడానికి 6 నుంచి 7 నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు.



