Just InternationalLatest News

AI: చంద్రయానం,ఫిఫా వరల్డ్ కప్,ఏఐ విప్లవం..2026లో ప్రపంచాన్ని మార్చే అద్భుతాలు ఇవే

AI: స్మార్ట్ వ్యవసాయం.. ఏఐ (AI) ఆధారిత పంటల పర్యవేక్షణ, మెరుగైన వ్యవసాయ పద్ధతులు సాధారణమైపోతాయి.

AI

కొత్త ఏడాది వచ్చేస్తోంది. 2026లో అంతరిక్షం, క్రీడలు, టెక్నాలజీ రంగాల్లో అంతకుముందు కంటే గొప్ప మార్పులు, విశేషాలు చూడబోతున్నాం. ముఖ్యంగా నాసా చంద్రయాత్ర ఆర్టెమిస్ II, ఫిఫా ప్రపంచ కప్, చైనా అంతరిక్ష మిషన్లు, బయోటెక్నాలజీలో కొత్త ఔషధాలు వంటివి హైలైట్స్ కానున్నాయి.

అంతరిక్షంలో విప్లవం- నాసా మానవసహిత చంద్రయాత్ర.. నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్‌ను 2026 ఏప్రిల్‌లో చేపట్టనుంది. ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై దిగకుండా, చుట్టూ ప్రయాణం చేస్తారు. ఇది దాదాపు 10 రోజుల ప్రయాణం. ఆర్టెమిస్ ప్రోగ్రాంలో ఇది రెండవ మిషన్.

చైనా చంద్ర అన్వేషణ.. చైనా Chang’e 7 మిషన్‌ను 2026 చివరలో ప్రయోగిస్తుంది. ఇందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, ఒక మినీ ఫ్లయింగ్ ప్రోబ్‌ను చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడానికి పంపుతుంది.

స్పేస్ టెలిస్కోప్.. చైనా రూపొందించిన క్సున్తియాన్ (Xuntian) అనే స్పేస్ టెలిస్కోప్‌ను 2026లో ప్రారంభిస్తుంది. ఇది నక్షత్రాలు, గెలాక్సీలు, చీకటి పదార్థం వంటి వాటిని పరిశోధించడానికి, చైనా తియాంగాంగ్‌ స్పేస్ స్టేషన్‌తో కలిసి పనిచేస్తుంది.

క్రీడా రంగంలో విప్లవం -ఫిఫా వరల్డ్ కప్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ఫిఫా వరల్డ్ కప్ 2026 జూన్ 11 నుంచి జూలై 19 మధ్య అమెరికా, కెనడా, మెక్సికోలలో జాయింట్‌గా జరుగుతుంది. ఈసారి 48 జట్లు పాల్గొని, 16 నగరాల్లోని స్టేడియాల్లో 104 మ్యాచ్‌లు ఆడతాయి. ప్రారంభ మ్యాచ్ మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజ్టెకాలో జరుగుతుంది.

AI
AI

టీ20 ప్రపంచ కప్.. భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచ కప్ 2026ను నిర్వహిస్తాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటాయి.

టెక్నాలజీ, సైన్స్ (AI)లో విప్లవం-బయోటెక్నాలజీ: జీన్ ఎడిటింగ్ సాంకేతికతలు, కొత్త ఔషధాల అభివృద్ధి జరుగుతుంది.

పునరుత్పాదక శక్తి.. సౌర శక్తి, హైడ్రోజన్ ఇంధనం వినియోగం బాగా పెరుగుతుంది.

స్మార్ట్ వ్యవసాయం.. ఏఐ (AI) ఆధారిత పంటల పర్యవేక్షణ, మెరుగైన వ్యవసాయ పద్ధతులు సాధారణమైపోతాయి.

గ్లోబల్ సదస్సులు.. న్యూరోసైన్స్ కాంగ్రెస్ (మే 14-15, కౌలాలంపూర్) , గేమిఫిన్ 2026 (గేమిఫికేషన్ సదస్సు – మార్చి 23-27, ఫిన్లాండ్) వంటి కీలక గ్లోబల్ కాన్ఫరెన్సులు జరగనున్నాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button