Putin:మలమూత్రాలను కూడా తీసుకెళతారు.. పుతిన్ పర్యటనలో విచిత్రాలు తెలుసా ?
Putin:తాజాగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ కు వస్తున్నారు.
Putin
మన దేశంతో పోలిస్తే అమెరికా, రష్యా వంటి దేశాఅధ్యక్షులకు భద్రత కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం సెక్యూరిటీనే కాదు తినే భోజనం, ఇతర అంశాల్లోనూ చాలా విచిత్రాలు కనిపిస్తుంటాయి. తాజాగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్(Putin) రెండు రోజుల పర్యటన కోసం భారత్ కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పుతిన్ భారత్ పర్యటన కోసం ఆయన సిబ్బంది అత్యున్నత స్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్వవేక్షిస్తున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో పుతిన్ తినే ప్రతీ ఆహారం కూడా రష్యా నుంచి తెచ్చిన ల్యాబొరేటరీలో పరీక్షించాల్సిందే. ఆ తర్వాతే ఆయనకు అందిస్తారు.
ఆయన పర్యటనలో ప్రత్యేక చెఫ్‌లు కూడా అందుబాటులో ఉంటారు. తమ అధ్యక్షుడి భద్రతలో భాగంగా బయటి దేశాల్లోని వస్తువులతో ఏదీ తయారు చేయరు. వారు రష్యా నుంచి తెచ్చిన వంట దినుసులతోనే పుతిన్‌కు భోజనం సిద్ధం చేస్తారు. అది కూడా ల్యాబ్ సిబ్బంది పరీక్షించిన తర్వాతే మాత్రమే పుతిన్ కు అందిస్తారు. అమెరికా ప్రెసిడెంట్ తరహాలోనే భారత పర్యటనలో పుతిన్ ప్రయాణించే ప్రత్యేక వాహనం ముందుగానే ఇక్కడకు చేరుకుంటుంది. క్షిపణి దాడులను సైతం తట్టుకునే బుల్లెట్ ఫ్రూఫ్ కారులోనే పుతిన్ ప్రయాణిస్తారు.

ఇక్కడ అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే రెండు రోజుల పర్యటనలో పుతిన్ (Putin)విసర్జించే మలమూత్రాలను కూడా ఆయన భద్రతా సిబ్బంది ఓ సంచీలో భద్రపరిచి మాస్కోకు తిరిగి తీసుకెళ్ళిపోతారు. దీని కోసం ఆయన ఉపయోగించే టాయ్‌లెట్ మాస్కో నుంచే వస్తుంది. అలాగే టెలిఫోన్ బూత్ కూడా మాస్కో నుంచే తీసుకొస్తారు. బయటి ఫోన్లు వాడేందుకు అనుమతి ఉండదు. పుతిన్ భద్రతాను చూసుకునే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ నెల రోజుల ముందే పర్యటించే దేశంలోని పరిస్థితులు, క్రైమ్ రేట్ ,నిరసనలు, ఉగ్రవాదం మతపరమైన కార్యక్రమాల గురించి ఆరా తీసి జాగ్రత్తలు తీసుకుంటారు.
నెల రోజుల ముందే పుతిన్ బస చేసే హోటల్ ను ఆధినంలోకి తీసుకుని పరిశీలిస్తుంటారు. ఆయన వచ్చే ముందు హోటల్ లోని సాధారణ ఆహార పదార్ధాలు తీసేసి, మాస్కో నుంచి తెచ్చినవి అక్కడ పెడతారు. పుతిన్‌తో కనీసం 100 మంది ప్రయాణిస్తారు. వీరిలో వ్యక్తిగత అంగరక్షకులు, ఎస్బీపీ, ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ బృందాలు, ప్రొటొకాల్ ఆఫీసర్లు, పరిపాలనా సిబ్బంది, మీడియా సభ్యులు ఉంటారు.
ఇక పుతిన్(Putin) ప్రయాణించే విమానం అత్యంత అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. క్షిపణి దాడులను సైతం తట్టుకునేలా దీనిని తయారు చేశారు. దాదాపు 250 మంది దీనిలో ప్రయాణించొచ్చు. బార్, జిమ్, స్పిమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.


