US government shutdown: బిల్లులు ఆమోదించని సెనేట్ అమెరికా ప్రభుత్వం షట్ డౌన్

US government shutdown: అమెరికాలో షట్‌డౌన్ పరిస్థితి రావడం కొత్తమీ కాదు. 1981 నుంచి 15 సందర్భాల్లో అమెరికా షట్‌డౌన్‌ పరిస్థితులను ఎదుర్కొంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018లో మూడుసార్లు అమెరికాలో షట్‌డౌన్ విధించారు.

US government shutdown

అగ్రరాజ్యం అమెరికా(US government shutdown)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు మూడు నెలలుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ ప్రభుత్వం షట్ డౌన్ అయింది. ప్రభుత్వ సేవలన్నీ నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్‌ ద్వారా ఆమోదించాలి.

ఈ సంవత్సరం, రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు, కానీ బిల్లు ఆమోదించాలంటే ఆరోగ్య బీమా సబ్సిడీలను పొడిగించాలని డెమోక్రాట్లు పట్టుబట్టారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్‌ చర్చల నుంచి వేరుగా చర్చించాలని చెప్పారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. సెనేట్ లో కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు సాధించాల్సి ఉంటుంది.

US government shutdown

తాజా ఓటింగ్ లో మాత్రం ఆమోదానికి సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ తప్పకుండా 60 రిపబ్లికన్ పార్టీ 55, విపక్ష డెమొక్రటిక్ పార్టీ 45 ఓట్లను సాధించాయి. ఈ రెండు పార్టీలు కలిసి సమన్వయం చేసుకుంటేనే ట్రంప్ ప్రభుత్వానికి నిధుల కేటాయింపుతో ముడిపడిన బిల్లు ఆమోదానికి లైన్ క్లియర్ అవుతుంది. అయితే బిల్లుకు సంబంధించిన పలు ప్రతిపాదనలపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు. దీంతో అమెరికాలో షట్‌డౌన్ మొదలైంది.

US government shutdown

అమెరికా(US government shutdown)లో షట్‌డౌన్ పరిస్థితి రావడం కొత్తమీ కాదు. 1981 నుంచి 15 సందర్భాల్లో అమెరికా షట్‌డౌన్‌ పరిస్థితులను ఎదుర్కొంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018లో మూడుసార్లు అమెరికాలో షట్‌డౌన్ విధించారు. అప్పుడు అమెరికా చరిత్రలోనే 35 రోజులపాటు సాగిన సుదీర్ఘ షట్‌డౌన్‌గా నిలిచింది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండానే పనిచేయాల్సి వచ్చింది.

కాగా షట్ డౌన్ కారణంగా ప్రభుత్వరంగాల సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పాస్‌పోర్ట్, వీసా, క్లినికల్ ట్రయల్స్, తుపాకీ పర్మిట్లు వంటి ప్రభుత్వ సేవలకు బ్రేక్ పడిపోతుంది. స్టాక్ మార్కెట్‌పైనా షట్‌డౌన్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా టూరిజం రంగం కుదేలవుతుంది. ఎందుకంటే అమెరికాలో టూరిజం ఆదాయం భారీగా ఉంటుంది. ఎక్కువ రోజులు షట్ డౌన్ కొనసాగితే మాత్రం 140 మిలియన్ డాలర్ల వరకూ నష్టపోతుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు మామూలుగా ఉండవు.

US government shutdown

ఇప్పటికే ఏడున్నర లక్షలకు పైగా ఉద్యోగుల ఫ్యూచర్ అగమ్యగోచరంగా మారింది. అవసరానికి మించి ఉన్నారా… ఏ విభాగానికి ఎంత మంది కావాలన్న లెక్కలు తీస్తారు. ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించడం ఖాయమైనట్టే.. ఎందుకంటే షట్ డౌన్ ప్రకటన తర్వాత ట్రంప్ ఇదే మాట చెప్పారు. అటు చాలా కీలక ప్రాజెక్టులు ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సెనేట్ లో బిల్లులు పాసయ్యేవరకూ అమెరికాకు కష్టాలు తప్పవు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version