Just InternationalLatest News

Tariffs: భారత్‌తో మైత్రి ముఖ్యం..ట్రంప్ విధించిన సుంకాలపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల డిమాండ్

Tariffs : గతంలో బ్రెజిల్‌పై (Brazil) విధించిన సుంకాలను రద్దు చేయాలనే ఉద్దేశంతో సెనేట్‌లో (Senate) ఇప్పటికే డెమొక్రట్లు, రిపబ్లికన్లు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు.

Tariffs

భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) 50 శాతం వరకు సుంకాలు (Tariffs) విధించి, అమలు చేస్తున్న విషయంపై ఇప్పుడు యూఎస్ కాంగ్రెస్ (US Congress) నుంచి ఒక ముఖ్యమైన చర్య మొదలైంది. ఆర్థిక, భద్రతా సమస్యలకు సంబంధించి జాతీయ అత్యవసర పరిస్థితిని (National Emergency) ప్రకటించి ట్రంప్ ఈ సుంకాలు విధించారు. ఇప్పుడు ఈ అదనపు సుంకాలను తక్షణమే ముగించాలి అంటూ అమెరికా ప్రతినిధుల సభలో శుక్రవారం రోజున ముగ్గురు కీలక కాంగ్రెస్ సభ్యులు ఒక తీర్మానాన్ని (Resolution) ప్రవేశపెట్టారు.

ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారిలో డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి ఉన్నారు. జాతీయ అత్యవసర ప్రకటన కింద తీసుకుంటున్న ఈ అక్రమ చర్యల అమలును ఇక ముగించాలనే లక్ష్యంతో వీరు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ట్రంప్‌ తీసుకున్న ఈ చర్యలు అమెరికా కార్మికులు (US Workers), వినియోగదారులు (Consumers), అలాగే భారత్‌-యూఎస్‌ ద్వైపాక్షిక సంబంధాలకు (Bilateral Relations) హానికరమని ఈ ముగ్గురూ తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు.

ఈ తీర్మానంలో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో బ్రెజిల్‌పై (Brazil) విధించిన సుంకాల(Tariffs)ను రద్దు చేయాలనే ఉద్దేశంతో సెనేట్‌లో (Senate) ఇప్పటికే డెమొక్రట్లు, రిపబ్లికన్లు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా భారత్‌కు సంబంధించిన సుంకాల విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని వీరు కోరుతున్నారు. అంతేకాకుండా, అత్యవసర అధికారాల (Emergency Powers) కింద దిగుమతి సుంకాలను పెంచేందుకు వీలుగా అమెరికా అధ్యక్షుడికి ఉన్న అధికారాలను నియంత్రించాలనే ఉద్దేశం కూడా ఈ తీర్మానంలో స్పష్టంగా కనిపిస్తోంది.

Tariffs
Tariffs

ఈ తీర్మానం ప్రధానంగా భారత్‌పై ఈ ఏడాది ఆగస్టు 27న విధించిన అదనపు 25 శాతం సెకండరీ డ్యూటీలను (Secondary Duties) తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ సెకండరీ డ్యూటీల వల్లే, అంతకుముందున్న సుంకంతో కలిసి, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (I.E.E.P.A. – ఐఈఈపీఏ) కింద భారత ఉత్పత్తులపై మొత్తం సుంకాలు ఏకంగా 50 శాతానికి చేరాయి. ఈ ఐఈఈపీఏ అనేది, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో (National Emergency) వాణిజ్య, ఆర్థిక ఆంక్షలు విధించేందుకు వీలుగా అమెరికా అధ్యక్షుడికి ఉన్న ఒక చట్టం.

భారత్‌తో బలమైన బంధం అవసరం..ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ్యులు తమ తమ ప్రాంతాలపై ఈ సుంకాల ప్రభావం ఎలా ఉందో వివరించారు. కాంగ్రెస్‌ సభ్యురాలు డెబోరా రాస్ మాట్లాడుతూ, “అమెరికాలోని ఉత్తర కరోలైనా (North Carolina) ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో భారత్‌తో చాలా లోతుగా అనుసంధానమై ఉంది. భారత కంపెనీలు మా రాష్ట్రంలో ఒక బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి, జీవశాస్త్రం, సాంకేతిక రంగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించాయి. మా తయారీదారులు కూడా ఏటా వందల మిలియన్ డాలర్ల విలువైన సరుకులను భారత్‌కు ఎగుమతి చేస్తున్నారు” అని తెలిపారు.

కాంగ్రెస్‌ సభ్యుడు మార్క్ వీసీ మాట్లాడుతూ, “భారత్ మాకు ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామి (Strategic Partner). ఈ అక్రమ సుంకాలు.. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఉత్తర టెక్సాస్ (North Texas) ప్రజలపై ఒక పన్ను (Tax) లాంటివి” అని అన్నారు.

భారతీయ అమెరికన్ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వివరిస్తూ, “ఈ సుంకాలు(Tariffs) పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. ఇవి సరఫరా చైన్‌లకు (Supply Chains) భంగం కలిగిస్తున్నాయి. అమెరికా కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయి. అలాగే, వినియోగదారుల ఖర్చులు పెంచుతున్నాయి” అని చెప్పారు. ఈ అదనపు సుంకాలకు ముగింపు పలకడం వల్ల యూఎస్-భారత్ ఆర్థిక, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన వివరించారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button