Trump :ప్రతీకార సుంకాల వేళ వాణిజ్య సంధి..ట్రంప్‌లో ఈ ఊహించని మార్పుకు కారణమేంటి?
Trump : అమెరికా రైతులకు, కంపెనీలకు భారత్ పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇస్తామంటే ఏ వ్యాపారవేత్త అయినా ఎందుకు కాదంటారు?
Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే భారత్‌పై సుంకాల బాదుడు మొదలెట్టేశారు. ఇటీవల ఏకంగా భారత్‌పై 50 శాతం వరకు సుంకాలు విధించి భయపెట్టారు. కానీ, సోమవారం ఫిబ్రవరి 2 రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన 45 నిమిషాల ఫోన్ కాల్ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేయడమే కాకుండా..టోటల్ టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. ఇది భారత ఎగుమతిదారులకు భారీ ఊరట అని చెప్పొచ్చు.
నిజానికి ట్రంప్ (Trump ) ఎప్పుడూ ఒక భారత్‌ను మిత్రదేశంగా భావించలేదు. కేవలం ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తారు. ఆయనకు దేశాల కంటే డీల్స్ ముఖ్యం అన్నట్లే ప్రవర్తిస్తారు. అయితే తాజా పరిణామం గురించి విశ్లేషకులు మూడు కోణాల్లో వివరిస్తున్నారు.
బలమైన బేరసారాలు (Art of the Deal).. మొదట భారీ సుంకాలు విధించి ఒత్తిడి పెంచడం, ఆ తర్వాత అవతలి దేశం నుంచి భారీ హామీలు తీసుకుని తగ్గడం ట్రంప్ పాత స్టైల్. ఇక్కడ కూడా అదే జరిగింది. రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపేస్తామని, అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు కొంటామని భారత్ హామీ ఇవ్వగానే ట్రంప్ మెత్తబడ్డారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. ఉక్రెయిన్ యుద్ధం ఆపడమే ట్రంప్ లక్ష్యం. భారత్ రష్యాకు పెద్ద కస్టమర్. భారత్ చమురు కొనడం ఆపేస్తే రష్యా ఆర్థికంగా దెబ్బతింటుంది. దీని ద్వారా పుతిన్ చర్చలకు వస్తారని ట్రంప్ ప్లాన్ వేశారు. దీనికి మోదీని ఒక కీలకమైన శాంతి రాయబారిగా ట్రంప్ చూస్తున్నారు.
బడ్జెట్ 2026 ప్రభావం.. తాజా బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా సుంకాలకు ప్రతిగా కొన్ని కౌంటర్ చర్యలు తీసుకున్నారు. ఇది గమనించిన ట్రంప్(Trump ), భారత్ లాంటి పెద్ద మార్కెట్‌ను వదులుకోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా వ్యవసాయం, బొగ్గు, గ్యాస్ రంగాలకు నష్టమని గ్రహించారు.
ఇండియా గేట్ సెంటిమెంట్.. ట్రంప్ తన సోషల్ మీడియాలో ఇండియా గేట్ ఫోటో పెట్టి అందమైన స్మారకం అని ప్రశంసించడం చాలామందికి షాక్ కలిగించే విషయమే.
అంతేకాదు వాషింగ్టన్ డీసీలో 250 అడుగుల ఇండిపెండెన్స్ ఆర్చ్ కోసం ఆయన ఇండియా గేట్ స్ఫూర్తిని తీసుకోవడం.. భారతీయులు కాస్త ఆశ్చర్యపోవాల్సిన విషయమే. వీటన్నిటి వెనుక ట్రంప్ మాస్టర్ మైండ్ తప్పకుండా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

చైనాను నిలువరించడం.. ఆసియాలో చైనాకు ఏకైక చెక్ భారత్ మాత్రమేనని పెంటగాన్ వర్గాలు ట్రంప్‌నకు క్లారిటీ ఇచ్చాయి. దీంతో భారత్‌తో గొడవ పడితే చైనాకే లాభమని ఆయనకు అర్థం చేసుకున్నాడు.
500 బిలియన్ డాలర్ల ఆఫర్..దీనికి తోడు అమెరికా రైతులకు, కంపెనీలకు భారత్ ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇస్తామంటే ఏ వ్యాపారవేత్త అయినా ఎందుకు కాదంటారు? అందుకే ట్రంప్ తన ప్రతీకార వైఖరిని పక్కన పెట్టి భాగస్వామ్య వైఖరిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇది బంగారం-వెండి ధరలపైన కూడా ప్రభావం చూపించబోతోంది. ఎలా అంటే ఈ వాణిజ్య ఒప్పందం వల్ల భారత్ – అమెరికా మధ్య సత్సంబంధాలు పెరిగి, అంతర్జాతీయంగా డాలర్ , రూపాయి మధ్య సమతుల్యత వస్తుంది.రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే ఈ ఆర్థిక అనిశ్చితి తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం నుంచి స్టాక్ మార్కెట్ వైపు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. దీంతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
Lord Hanuman:మంగళవారం మారుతి స్మరణం.. ఆరోజు అంజన్నకు ఏం చేయాలి?



