Just LifestyleLatest News

Foreign:ఫారిన్ ట్రిప్ అంటే కాస్ట్లీ కాదు.. ఈ దేశాల్లో రాజులా గడిపేయెచ్చు

Foreign: మన దేశం కంటే కరెన్సీ విలువ తక్కువగా ఉన్నవి, మన బడ్జెట్‌కు సరిపోయే అందమైన దేశాలు మన చుట్టూనే ఉన్నాయి.

Foreign

విదేశీ ( Foreign)ప్రయాణమంటే కేవలం కోటీశ్వరులకే సాధ్యమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, సరైన ప్లానింగ్ ఉంటే అది కూడా విమాన టిక్కెట్లతో సహా లక్ష రూపాయలలోపే అద్భుతమైన కొన్ని విదేశాలను చుట్టి రావొచ్చు.

మన దేశం కంటే కరెన్సీ విలువ తక్కువగా ఉన్నవి, మన బడ్జెట్‌కు సరిపోయే అందమైన దేశాలు మన చుట్టూనే ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు కూడా వెంటనే బ్యాగ్ సర్దుకుని బయలుదేరుతారు.

మొదటిది వియత్నాం.. ఇక్కడి ప్రకృతి అందాలు, పురాతన కట్టడాలు అందరినీ మంత్రముగ్ధులను చేస్తాయి. వియత్నాం కరెన్సీ ఇండియాలోని రూపాయి కంటే తక్కువ కాబట్టి, అక్కడ మీరు చాలా తక్కువ ధరకే లగ్జరీ హోటళ్లలో ఉండొచ్చు.

రెండోది థాయిలాండ్.. ఇది భారతీయులకు అత్యంత ఇష్టమైన దేశం. ఇక్కడి బీచ్‌లు, స్ట్రీట్ ఫుడ్ ,షాపింగ్ చాలా చౌకగా ఉంటాయి.

మూడోది బాలీ (ఇండోనేషియా).. ఆధ్యాత్మికత , బీచ్‌ల కలయిక ఈ దేశం. హనీమూన్ జంటలకు ఇది స్వర్గం వంటిది. ఇక్కడ మన రూపాయి విలువ ఎక్కువగా ఉండటం వల్ల మీరు తక్కువ ఖర్చుతోనే ఎంజాయ్ చేయొచ్చు.

Foreign
Foreign

నాలుగోది నేపాల్.. మన పక్కనే ఉన్న ఈ దేశానికి వెళ్లడానికి వీసా కూడా అవసరం పడదు. హిమాలయాల అందాలను చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఐదోది శ్రీలంక.. ఇక్కడి రామాయణ కాలం నాటి ప్రదేశాలు, బీచ్‌లు , పచ్చని కొండలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

అయితే ఈ దేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు కనీసం మూడు నెలల ముందు అయినా విమాన టిక్కెట్లు బుక్ చేసుకుంటే సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు చూడటానికి ట్యాక్సీల కంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడటం మంచిది. ఇంకెందుకు ఆలస్యం? మీ బడ్జెట్ ఫారిన్( Foreign) ట్రిప్‌ను ఇప్పుడే ప్లాన్ చేసుకోండి మరి!

Vasant Panchami:రేపే వసంత పంచమి.. సరస్వతీ దేవి కటాక్షం కోసం ఇలా చేయండి..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button