tips : వర్షాకాలం బురద మరకలు టెన్షన్ పెడుతున్నాయా.. ఈ చిట్కాలతో చెక్
tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు, దుస్తులపై బురద మరకలు పడటం సర్వసాధారణం. అందుకే వర్షం పడినప్పుడు బయటకు వెళ్లాలంటేనే టెన్షన్ పడతాం.

tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు, దుస్తులపై బురద మరకలు పడటం సర్వసాధారణం. అందుకే వర్షం పడినప్పుడు బయటకు వెళ్లాలంటేనే టెన్షన్ పడతాం. ఇష్టపడి కొన్న బట్టలు బురదతో పాడైపోతాయేమో అని బెంగ పడుతుంటాం. సరిగ్గా శుభ్రం చేయకపోతే స్మెల్‌తో పాటు ఫంగస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని సులువైన చిట్కాలతో ఈ మొండి మరకలను ఈజీగా తొలగించవచ్చు.
tips
మరక పడగానే చాలా మంది చేసే తప్పు, వెంటనే తుడిచేయడం. దీనివల్ల బురద బట్టలోకి మరింత లోతుగా ఇంకిపోతుంది. అసలు రహస్యం ఏంటంటే.. బురద పూర్తిగా ఎండిపోయేంత వరకు దాన్ని కదపకూడదు. ఎండిన తర్వాత, స్పూన్ లేదా మరీ షార్ప్‌గా లేని కత్తితో నెమ్మదిగా గీకి, ముందుగా గట్టి బురదను తొలగించండి.
వెనిగర్ మ్యాజిక్: మొండి మరకలు, దుర్వాసన పోవాలంటే తెల్ల వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది. ఒక బకెట్ నీటిలో 5 కప్పుల వెనిగర్ కలిపి, మరకలు పడ్డ దుస్తులను కాసేపు నానబెట్టండి. లేదా, నేరుగా వాషింగ్ మెషీన్‌లో బట్టలతో పాటు కొంచెం వెనిగర్ వేయండి. ఇది రసాయనాలు లేకుండా దుస్తులను శుభ్రం చేస్తుంది.
బేకింగ్ సోడా పవర్: బేకింగ్ సోడా కూడా మరకలను వదిలించడంలో, దుస్తులకు కొత్త మెరుపును ఇవ్వడంలో ది బెస్ట్‌గా పనిచేస్తుంది.మరకలున్న చోట నేరుగా బేకింగ్ సోడా చల్లి కాసేపు ఉంచండి. అది బురదను వదులు చేసి రాలిపోయేలా చేస్తుంది.లేదా, బేకింగ్ సోడాని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి, మరకలపై అప్లై చేసి నెమ్మదిగా రుద్దండి.
వేడి నీరు + టూత్ బ్రష్: ఇది మొండి మరకలకు బ్రహ్మాస్త్రం.మరకలు పడ్డ దుస్తులను వేడి నీళ్లు, డిటర్జెంట్ కలిపిన బకెట్‌లో కనీసం గంట పాటు నానబెట్టండి.తర్వాత, పాత, మెత్తని టూత్ బ్రష్‌తో మరకలపై నెమ్మదిగా రుద్ది, ఆపై సాధారణంగా ఉతకండి. ఈ చిట్కాలు పాటిస్తే, మీ దుస్తులు వర్షాకాలంలో కూడా మెరిసిపోతాయి.