Horses:ఇంట్లో గుర్రాల ఫోటో ఉంటే మంచిదట.. ఎందుకో తెలుసా?
Horses: పరుగు తీస్తున్న ఏడు తెల్లని గుర్రాలు మీ జీవితంలో ఆగిపోయిన పనులను వేగవంతం చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Horses
చాలా మంది ఇళ్లలో లేదా ఆఫీసుల్లో.. ఏడు గుర్రాలు(Horses) పరుగు తీస్తున్న పెయింటింగ్ లేదా ఫోటోను చూస్తూ ఉంటాం. ఇది కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదంటారు వాస్తు నిపుణులు.
ఎందుకంటే..దీని వెనుక లోతైన వాస్తు , ఫెంగ్ షుయ్ అర్థం ఉంది. గుర్రాలు అనేవి వేగానికి, శక్తికి, పట్టుదలకు , విజయానికి ప్రతీకలు.
వాస్తు ప్రకారం, ఏడు సంఖ్య అంటే సప్తరుషులు, సప్తవర్ణాలు ఇలా సప్త అనేవి చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అందుకే పరుగు తీస్తున్న ఏడు తెల్లని గుర్రాలు మీ జీవితంలో ఆగిపోయిన పనులను వేగవంతం చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కెరీర్ లో ఎదగాలనుకునే వారు, వ్యాపారంలో లాభాలు ఆశించే వారు ఈ ఫోటోను తప్పనిసరిగా ఉంచుకోవడం మంచిది. ఈ గుర్రాలు (Horses)ఉత్సాహానికి, నిరంతర ఎదుగుదలకు సూచికలు. ఈ ఫోటోను చూసినప్పుడల్లా మనలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ , పని చేయాలనే ప్రేరణ కలుగుతాయి.

మంచిది కదా అని ఈ ఫోటోను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట. దీనిని ఇంటి హాల్లోనో లేదా ఆఫీసు క్యాబిన్లోనో అది కూడా దక్షిణ లేదా తూర్పు దిశ గోడపైన మాత్రమే పెట్టాలట.
దక్షిణం అనేది కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన దిశ కాబట్టి, గుర్రాలు లోపలికి పరుగెత్తుతున్నట్లుగా అమర్చాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.అలాగే గుర్రాల ముఖం కిటికీ లేదా తలుపు వైపు ఉండకూడదట. అంతేకాదు మనం పెట్టే గుర్రాల ఫోటోలో అవి ఆనందంగా ఉన్నట్లు ఉండాలి కానీ, కోపంగా ఉన్నట్లు ఉండకుండా ఉండేలా చూసుకోవాలట.
ఇలా సరైన దిశలో ఈ ఫోటోను ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది , చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగి విజయం వరిస్తుంది.
Japanese:జపాన్ ప్రజల లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ సీక్రెట్ ఇదేనట.. మీరూ ట్రై చేయండి..



