Sun Tan:సన్ ట్యాన్‌కు 10 నిమిషాల్లోనే చెక్..ఈ చిట్కా ఫాలో అయిపోండి..
Sun Tan: మన వంటింట్లోనే ఉండే పదార్థాలతో సహజంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సన్ ట్యాన్ ను ఈజీగా తొలగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Sun Tan
వేసవి కాలంలోనే కాదు, ఎండ ఎక్కువగా ఉన్నపుడు ఏ సమయంలో బయటకు వెళ్లినా మన చర్మం సన్ ట్యాన్(Sun Tan) కు గురవుతుంది. చర్మంపై ఉండే మెలనిన్ ఉత్పత్తి పెరగడం వల్ల స్కిన్ నల్లగా, నిర్జీవంగా కనిపిస్తుంది. మార్కెట్లో లభించే బ్లీచింగ్ క్రీములు చర్మానికి హాని కలిగిస్తాయి. కానీ మన వంటింట్లోనే ఉండే పదార్థాలతో సహజంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సన్ ట్యాన్ ను ఈజీగా తొలగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అద్భుతమైన హోమ్ మేడ్ ప్యాక్ – టమోటా , శనగపిండి ..టమోటాలో ఉండే లైకోపీన్ , యాసిడ్ గుణాలు చర్మంపై ఉన్న టాన్ ను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. శనగపిండి చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సర్‌లా ఉపయోగపడుతుంది.
దీనికోసం 2 చెంచాల టమోటా గుజ్జు, 1 చెంచా శనగపిండి, కొద్దిగా నిమ్మరసం (చర్మం సున్నితంగా ఉంటే నిమ్మరసం వాడకూడదు) తీసుకోవాలి.
ఈ మూడింటిని కలిపి పేస్ట్ లా చేసి ముఖం, మెడ, చేతులకు పట్టించి.. 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మెల్లగా రుద్దుతూ కడిగేయాలి.

టమోటాలో విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల..ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పెరుగు లేదా నిమ్మరసం కలిపితే రిజల్ట్ ఇంకా బాగా ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లోనే చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, స్కిన్ తాజాగా మెరుస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది. బయట నుంచి రాగానే ఈ ప్యాక్ వేసుకుంటే టాన్ పేరుకుపోకుండా ఉంటుంది. వారానికి ఒకసారి అయినా దీనిని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
T20 Series: కివీస్‌పై మళ్లీ అభిషేకాస్త్రం..టీ ట్వంటీ సిరీస్ భారత్ కైవసం




How are you?