World Cup : మనకు మరో వరల్డ్ కప్ లోడింగ్ భారత్‌కు ఎదురు లేనట్టేనా ?
World Cup : టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్‌ను ‘గ్రేటెస్ట్ టీ20 టీమ్ గా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

World Cup
టీ ట్వంటీ ఫార్మాట్ లో సాధారణంగా ఎవ్వరినీ ఫేవరెట్లుగా చెప్పలేం.. ఎందుకంటే ఈ ఫాస్టెస్ట్ ఫార్మాట్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. చిన్న జట్లు కూడా పెద్ద జట్లకు షాకిచ్చిన సందర్భాలున్నాయి. అయితే ఈ పొట్టి క్రికెట్ లో టీమిండియా మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
2024లో టీ20 ప్రపంచకప్(World Cup) గెలిచినప్పటి నుంచీ ఈ ఫార్మాట్ లో మనకు ఎదురే లేకుండా పోయింది. ప్రత్యర్థులతో సంబంధం లేకుండా ఆడిన ప్రతీ సిరీస్ లోనూ దుమ్మురేపింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆడిన 9 సిరీస్ లోనూ జయకేతనం ఎగరవేసింది. జింబాబ్వే , శ్రీలంక, బంగ్లాదేశ్ , సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ , ఆసియాకప్ , ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా..ఇప్పుడు న్యూజిలాండ్ పైనా సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సొంతగడ్డపై జరిగే టీ 20 ప్రపంచకప్ కు ముందు సిరీస్ విజయం ఫుల్ జోష్ ఇస్తోంది.
బ్యాటింగ్ లో సంజూ వైఫల్యం తప్పిస్తే.. అభిషేక్ , సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా , దూబే అందరూ ఫామ్ అందుకున్నారు. బౌలింగ్ పరంగా మాత్రం కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పేసర్లు వికెట్లు తీస్తున్నా పరుగులు ఇచ్చేస్తున్నారు. అదొక్కటి మెరుగుపరుచుకుంటే మాత్రం తిరుగుండదు.
ఇదిలా ఉంటే గణాంకాల పరంగానూ టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను అత్యుత్తమ జట్టుగా చెప్పొచ్చు. ఈ మెగా టోర్నీలో భారత్ విజయశాతం 70.5గా ఉంది. పొట్టి వరల్డ్‌కప్‌లో పాల్గొన్న అన్ని జట్లలోనే ఇదే అత్యధికం. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా కూడా టీమిండియా రికార్డు సృష్టించింది.

టైటిల్స్ పరంగా కూడా మంచి స్థానంలో ఉంది. 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత్.. 2024లో మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతేకాదు 2014లో రన్నరప్‌గా నిలిచిన భారత్.. 2016, 2022ల్లో సెమీఫైనల్స్‌కు చేరింది.
దాదాపు ప్రతి ఎడిషన్‌లోనూ నాకౌట్ దశకు చేరడం భారత్ కున్న మరో అద్భుతమైన రికార్డు. ఈ గణాంకాలన్నీ చూస్తే.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్‌ను ‘గ్రేటెస్ట్ టీ20 టీమ్ గా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Sun Tan:సన్ ట్యాన్‌కు 10 నిమిషాల్లోనే చెక్..ఈ చిట్కా ఫాలో అయిపోండి..



