Children:పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే చిన్న తప్పులు..మీరూ ఇవే చేస్తున్నారా?
Children: పిల్లలు తప్పు చేసినప్పుడు అందరి ముందు తిట్టకూడదు. దీని కంటే, విడిగా పిలిచి వారికి సర్ది చెప్పడం వల్ల వారిలో మార్పు వస్తుంది.
Children
పిల్లల (children) పెంపకం అనేది చిన్నగా కనిపించినా కూడా అది నిజంగా ఒక కళ. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు గొప్పగా ఎదగాలని కోరుకుంటారు కానీ ఆచరణలో అది అమలు చేయరు.
సైకాలజీ ప్రకారం, పేరెంట్స్‌కు తెలియకుండానే వాళ్లు చేసే కొన్ని చిన్న చిన్న పనులు వారి మనస్తత్వాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఇతరుల పిల్లలతో తమ పిల్లలను పోల్చకూడదు. అంటే.. పక్కంటి అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చాయని లేదా వేరే అమ్మాయి బాగా పాడుతుందని, చక్కగా పనులు చేస్తుందని ఇలా కంపేర్ చేసి మన పిల్లలతో మాట్లాడటం వల్ల వారిలో ఆత్మన్యూనత భావం పెరుగుతుంది.

ఇది భవిష్యత్తులో వారికి తెలీకుండానే వారు ఏ పని చేయాలన్నా భయపడేలా చేస్తుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు అందరి ముందు తిట్టకూడదు. దీని కంటే, విడిగా పిలిచి వారికి సర్ది చెప్పడం వల్ల వారిలో మార్పు వస్తుంది.
అలాగే పిల్లలు (children) ఏదైనా అడగగానే లేదా ఏడ్చి మారాం చేయగానే.. వెంటనే ఇచ్చేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల వారికి వస్తువుల విలువ తెలియదు. వారికి నిజంగా ఏది అవసరమో అదే ఇవ్వాలి. ఒకవేళ పేరెంట్స్‌కు కూడా ఇవ్వాలని ఉంటే వెంటనే కొని ఇవ్వకుండా కొద్ది రోజులు ఆగి ఇవ్వడం అలవాటు చేయాలి. ఒక్కోసారి ‘నో’ అన్న పదాన్ని కూడా వారు విని అలవాటు చేసుకునే విధంగా వారిని పెంచాలి.అప్పుడే జీవితంలో ఎదురయ్యే ఓటములను పిల్లలు తట్టుకోగలరు.
ప్రతిరోజూ పిల్లలతో (children) కనీసం అరగంట అయినా సమయం గడపాలి. వారు చెప్పే చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా వింటూ ఉండాలి. దీనివల్ల వారికి మీ మీద నమ్మకం, ప్రేమ పెరుగుతుంది.
అలాగే వారి చిన్న విజయాలను కూడా అభినందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. గ్యాడ్జెట్స్ కి బదులుగా పుస్తకాలు చదవడం లేదా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న ఆటలు ఆడుకోవడం అలవాటు చేయాలి.
అంతేకాదు పిల్లలు (children) మనం చెప్పేది వినడం కంటే, మనం చేసేది చూసి ఎక్కువగా నేర్చుకుంటారు.ముఖ్యంగా భర్త భార్యకు గౌరవం ఇవ్వడం, పెద్దవాళ్లపై మమకారం వంటివి చూసి అదే నేర్చుకుంటారు. కాబట్టి మనం వారికి రోల్ మోడల్ గా ఉండాలి.
Braille:లూయిస్ బ్రెయిలీ లిపికి 200 ఏళ్లు.. ఎన్నో జీవితాలను మార్చిన ఆరు చుక్కల అద్భుతం



