Liver problems
మన శరీరంలో అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగపడుతుందని భావించే రక్త వర్గం (Blood Group), మన కాలేయ ఆరోగ్యం గురించి కూడా చాలా కీలకమైన విషయాలు చెబుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ‘ఫ్రాంటియర్స్’ అనే ప్రఖ్యాత జర్నల్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, కొన్ని రక్త వర్గాలు ఉన్నవారికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులు (Autoimmune Liver Diseases-Liver problems) వచ్చే ప్రమాదం అధికంగా ఉంది.
.
ఈ పరిశోధనలో తేలిన ముఖ్య విషయం ఏమిటంటే, A రక్త వర్గం కలిగిన వారికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులు(Liver problems) సోకే ముప్పు ఎక్కువగా ఉంది. ఈ రకమైన వ్యాధుల్లో, మన రోగనిరోధక వ్యవస్థ (Immune System) పొరపాటున మన కాలేయంపై దాడి చేసి, దాన్ని దెబ్బతీస్తుంది.
పరిశోధకులు దాదాపు 1,200 మందిని పరీక్షించగా, వారిలో 114 మందికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధి (Liver problems)ఉన్నట్లు గుర్తించారు. కాలేయ సమస్యలు ఉన్న ఈ వ్యక్తులలో ‘A’ రక్త వర్గం అధికంగా ఉంది. ఆ తర్వాత క్రమంలో O, B మరియు AB గ్రూపులు ఉన్నాయి. ముఖ్యంగా, ప్రైమరీ బిలియరీ కోలాంగైటిస్ (Primary Biliary Cholangitis – PBC) వంటి దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులు ‘A’ గ్రూప్ వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
దీనికి విరుద్ధంగా, B రక్త వర్గం ఉన్నవారికి కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా, పిత్తాశయ నాళాలను (Bile Ducts) దెబ్బతీసే మరియు కాలేయంలో పిత్తం పేరుకుపోయే దీర్ఘకాలిక వ్యాధి అయిన PBC బారిన వీరు పడే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ PBC వ్యాధి కాలేయ సిర్రోసిస్ మరియు కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది.
మీ రక్త వర్గం ‘A’ అయినంత మాత్రాన మీకు కాలేయ వ్యాధి తప్పకుండా వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక “ప్రమాద కారకం” (Risk Factor) మాత్రమే. కాబట్టి, మరింత అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.
ఏ విధమైన స్పష్టమైన కారణం లేకుండా తరచుగా అలసటగా అనిపించడం, కీళ్ల నొప్పులు వంటి చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే అలెర్ట్ అయ్యి, వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. సరైన జీవనశైలి మార్పులు మరియు వ్యాధిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
కాలేయ ఆరోగ్యం కోసం పాటించాల్సిన నియమాలు..PBC వంటి దీర్ఘకాలిక కాలేయ వ్యాధులను ఎదుర్కొనే వారు లేదా ప్రమాదం ఉన్నవారు ఈ జీవనశైలి మార్పులను పాటించడం ఉత్తమం.ఆల్కహాల్ కాలేయానికి మరింత హానికరం కాబట్టి, దానిని పూర్తిగా నివారించాలి.ఆహారంలో ఉప్పు (సోడియం) తక్కువగా ఉండేలా చూసుకోవడం వలన కడుపులో నీరు నిలిచిపోకుండా ఉంటుంది.
తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు మరియు చిక్కుళ్లు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఆలివ్ ఆయిల్ వాడటం, సంతృప్త కొవ్వులను తగ్గించడం మంచిది.
PBC ఉన్నవారికి ఎముకలు బలహీనపడే (ఆస్టియోపోరోసిస్) ప్రమాదం ఉంది. కాబట్టి, కాల్షియం మరియు విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాలు లేదా సప్లిమెంట్లను తీసుకోవడం అవసరం. రోజూ వ్యాయామం చేయడం కాలేయ ఆరోగ్యానికి, ఎముకలు బలంగా ఉండటానికి తోడ్పడుతుంది.
