Diabetes
డయాబెటిస్ లేదా మధుమేహం అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ఒకప్పుడు వయసు పైబడిన వారికే పరిమితమైన ఈ వ్యాధి, ఇప్పుడు యువతలోనూ, పిల్లల్లోనూ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులే. శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటివి దీనికి దోహదం చేస్తున్నాయి.
డయాబెటిస్(Diabetes) అంటే శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కంటి చూపు కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.
దీనికి చెక్ పెట్టడానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తగ్గించాలి.
రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా, సైక్లింగ్ వంటి శారీరక వ్యాయామాలు చేయాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
అధిక ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి.సరైన జీవనశైలి మార్పులతో డయాబెటిస్‌ను సమర్థవంతంగా నివారించవచ్చు, అదుపులో ఉంచుకోవచ్చు.