Autism
పిల్లల పుట్టినరోజు వేడుక. అంతా కోలాహలంగా ఉంది. పిల్లలంతా ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. కానీ ఆ గదిలో ఒక చిన్నారి మాత్రం మూలన కూర్చుని తన బొమ్మ కారుతో ఆడుకుంటున్నాడు. ఎవరైనా మాట్లాడించినా స్పందించడం లేదు, కళ్లలోకి చూడటం లేదు. తన ప్రపంచంలో తను మునిగిపోయి ఉన్నాడు. మొదట తల్లిదండ్రులు వారి బిడ్డ ఇంట్రావర్ట్ అనుకుంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇది సాధారణ లక్షణం కాదని గ్రహిస్తారు. ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అని పిలిచే ఒక న్యూరో డెవలప్మెంటల్ పరిస్థితి అయి ఉండొచ్చు.
Swollen feet: తరచుగా అరికాళ్ల వాపులు వస్తున్నాయా? ఈ ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు!
ఆటిజం(Autism) స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక వ్యాధి కాదు, ఇది మెదడు పనితీరులో ఉండే ఒక భిన్నత్వం. అందుకే దీనికి “స్పెక్ట్రమ్” అనే పదం వాడతారు, ఎందుకంటే లక్షణాలు ఒకరిలో ఒకరికి వేరుగా ఉంటాయి. కొంతమందిలో లక్షణాలు తేలికపాటివిగా ఉండి సాధారణ జీవితం గడపగలరు, మరికొందరికి జీవితాంతం సహాయం అవసరం కావచ్చు. ఆటిజం ఎందుకు వస్తుందో పూర్తిగా తెలియకపోయినా, జెనెటిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కుటుంబ చరిత్ర, మెదడు నిర్మాణం, గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. అయితే, వ్యాక్సిన్ల వల్ల ఆటిజం వస్తుందనే అపోహ శాస్త్రీయంగా నిరూపించబడలేదు.
మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆటిజం(Autism) స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో సామాజిక సంబంధాలు, కమ్యూనికేషన్లో ఇబ్బందులు కనిపిస్తాయి. ఉదాహరణకు, కళ్లలోకి చూడకపోవడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోకపోవడం, మాటలు ఆలస్యంగా రావడం, లేదా ఒకే వాక్యాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం వంటి లక్షణాలు ఉంటాయి. వీరు ఒకే పనిని పదేపదే చేయవచ్చు, ఉదాహరణకు బొమ్మలను ఒకే వరుసలో అమర్చడం లేదా ఒకే ప్రశ్నను మాటిమాటికీ అడగడం. కానీ వీరికి కొన్ని ప్రత్యేక రంగాలలో అద్భుతమైన ప్రతిభ కూడా ఉంటుంది, ఉదాహరణకు గణితం, సంగీతం, చిత్రకళ లేదా జ్ఞాపకశక్తి వంటి వాటిలో అసాధారణ నైపుణ్యం చూపగలరు.
ఆటిజం ఉన్నవారు సమాజం నుంచి ఎదుర్కొనే ప్రధాన సమస్య వారిని అర్థం చేసుకోకపోవడం. వారిని అసాధారణంగా చూస్తారు, చదువులో వెనుకబడ్డారని అనుకుంటారు. నిజానికి వారి ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందంతే, వారికి బుద్ధి తక్కువ కాదు. సరైన సహాయం, సరైన పద్ధతులు ఉంటే వీరు కూడా సాధారణ జీవితాన్ని గడపగలరు.
Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి మరో మాస్టర్ మైండ్..హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడా
ఆటిజం(Autism) స్పెక్ట్రమ్ డిజార్డర్ కి పూర్తిగా చికిత్స లేకపోయినా, చిన్న వయసులోనే గుర్తించి ఇచ్చే శిక్షణ (Early Intervention) చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటివి వారి సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. తల్లిదండ్రులు సహనంతో వారి బలాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆటిజం స్పెక్ట్రమ్ అనేది ఒక బలహీనత కాదు.. సమాజం అర్థం చేసుకుని, ఆదరిస్తే ఈ ప్రత్యేకమైన ప్రపంచం నుంచి ఎంతోమంది ప్రతిభావంతులు బయటకు వస్తారు.