Swollen feet: తరచుగా అరికాళ్ల వాపులు వస్తున్నాయా? ఈ ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు!
Swollen feet: మీకు అరికాళ్లలో వాపుతో పాటు, శ్వాసలోపం, ఛాతీ నొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Swollen feet
అరికాళ్లలో వాపు (Swollen feet) రావడం అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్య. నడవడానికి, పరిగెత్తడానికి కూడా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కుర్చీలో కూర్చుని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే, ఎక్కువసేపు కాళ్లు కిందకు వేలాడడం వల్ల తిమ్మిర్లు, వాపు (Swollen feet)వస్తాయి. అలాగే, కాలికి ఏదైనా గాయం అయినప్పుడు కూడా వాపు రావడం సహజం. అయితే, కొన్నిసార్లు ఈ వాపులు అంతర్గత ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చంటున్నారు డాక్టర్లు
Krishna: శ్రీ కృష్ణుడి కిరీటంలో నెమలి ఈక..ఆ ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?
కిడ్నీ సమస్యలు: మీ అరికాళ్లలో తరచుగా వాపు వస్తే అది మూత్రపిండాల సమస్య కావచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయనివారి శరీరంలో ద్రవాలు పేరుకుపోయి, కాళ్లలో వాపు వస్తుంది. దీనితో పాటు శ్వాసలోపం, అలసట కూడా ఉంటాయి. కాబట్టి కిడ్నీ పరీక్ష చేయించుకోవడం మంచిది.

గుండె జబ్బులు: గుండె రక్తాన్ని సరిగా పంప్ చేయనప్పుడు శరీరంలో నీరు, ఉప్పు పేరుకుపోయి పాదాలలో వాపు వస్తుంది. దీని వల్ల హృదయ స్పందన పెరగడం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
కాలేయ సమస్యలు: కాలేయం అల్బుమిన్ అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు రక్తనాళాల నుంచి రక్తం కారి, పాదాలలో వాపు వస్తుంది. కామెర్లు, అలసట వంటివి కూడా ఈ సమస్యకు లక్షణాలు.
శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం: చెమట ద్వారా శరీరం నుంచి విషపదార్థాలు బయటకు వెళ్తాయి. ఈ ప్రక్రియ సరిగా జరగనప్పుడు టాక్సిన్స్ పేరుకుపోయి, చేతులు లేదా కాళ్లలో వాపుకు కారణమవుతాయి.
కాబట్టి, మీకు అరికాళ్లలో వాపు(Swollen feet)తో పాటు, శ్వాసలోపం, ఛాతీ నొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఒక సాధారణ సమస్యే అయినా, కొన్నిసార్లు ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సూచన కావచ్చు.
One Comment