Facial hair
మగవారిలో మీసాలు, గడ్డాలు కామన్.. కానీ, మహిళల విషయానికి వస్తే ముఖంపై ఉండే అవాంఛిత వెంట్రుకలు(Facial hair) వారికి తీవ్ర ఇబ్బందిని, కొన్నిసార్లు మానసిక కుంగుబాటును కలిగిస్తాయి. చాలామంది మహిళలు నొప్పి కలిగించే థ్రెడింగ్ లేదా ప్లైయర్‌తో వెంట్రుకలను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఉపరితల చికిత్సల్లో కాకుండా, శరీర అంతర్గత వ్యవస్థలో ఉందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
హార్మోన్ల అసమతుల్యతే ప్రధాన కారణం:
డాక్టర్లు వివరించిన దాని ప్రకారం, మహిళల ముఖంపై అవాంఛిత రోమాలు(Facial hair) రావడానికి ప్రధాన కారణం హార్మోన్ల మార్పులే. ముఖ్యంగా మహిళల్లో ఆండ్రోజెన్ (పురుష హార్మోన్) స్థాయిలు పెరిగినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది. దీనిని నివారించడానికి మనం చేయాల్సింది, హార్మోన్లను సమతుల్యంగా ఉంచుకోవడం. దీనికి ఎలాంటి మందులు అవసరం లేకుండా, కొన్ని సాధారణ ఇంటి చిట్కాలతో అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది.
హార్మోన్ల సమతుల్యత కోసం ఆయుర్వేద పానీయం తయారీ:
ముఖంపై వెంట్రుకల(Facial hair)ను నివారించడంతో పాటు, PCOD, PCOS వంటి సమస్యలను నివారించడానికి మరియు థైరాయిడ్ సమస్యలను తగ్గించడంలో సహాయపడే ఒక అద్భుతమైన పానీయం తయారుచేసే విధానం ఇక్కడ ఉంది:
కావాల్సిన పదార్థాలు:
1 టీస్పూన్ మెంతి గింజలు,అర అంగుళం అల్లం, ఒక అతి మధురం ముక్క (లైకోరైస్ రూట్ – Licorice Root), అర అంగుళం దాల్చిన చెక్క కొంచెం ఆస్పరాగస్ (శతావరి లేదా పిల్లి తేగ)
తయారీ విధానం
ఈ అన్ని పదార్థాలను 2 లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని బాగా కలిపి, ఆ నీటిని రోజంతా తక్కువ పరిమాణంలో తాగుతూ ఉండాలి.
ఈ మిశ్రమం ఎలా పనిచేస్తుందంటే.. ముఖంపై అవాంఛిత వెంట్రుకలు హార్మోన్ల అసమతుల్యత వల్లే వస్తాయి. ఈ ఆయుర్వేద కలయిక హార్మోన్లను సమతుల్యం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మెంతి గింజలు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి. అల్లం, దాల్చిన చెక్క శరీరంలో మంటను (Inflammation) తగ్గిస్తాయి. లైకోరైస్ ఆండ్రోజెన్ స్థాయిలను నియంత్రిస్తుంది, అలాగే ఆస్పరాగస్ స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థను పోషిస్తుంది. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, శరీరం యొక్క హార్మోన్ల వ్యవస్థ సమతుల్యం అవుతుంది. ఇది మెల్లమెల్లగా ముఖంపై అవాంఛిత రోమాలు పెరగడాన్ని తగ్గిస్తుంది, అంతేకాకుండా మీ చర్మం సహజ మెరుపును సంతరించుకుంటుంది.
