Flax Seed: అవిసె గింజలు చర్మం, జుట్టు పోషణకే కాదు ..ఇంకా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

Flax Seed: అవిసె గింజలలో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

Flax Seed

అవిసె గింజలు (Flax Seeds) – వీటిని లిగ్నన్ సీడ్స్ (Lignin Seeds) అని కూడా పిలుస్తారు – ఆరోగ్య ప్రయోజనాల పట్టికలో అగ్రస్థానంలో ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఔషధ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్న ఈ గింజలు, ఇప్పుడు సూపర్‌ఫుడ్‌గా స్థానం సంపాదించుకున్నాయి. అవిసె గింజలలో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి.

గుండె ఆరోగ్యానికి రక్షణ కవచం.. అవిసె గింజల(Flax Seed)లో ఉండే ఆల్ఫా లైనోలిక్ యాసిడ్ (ALA) అనేది ఒక రకమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీని ద్వారా ధమనులలో కొవ్వు పేరుకుపోవడం తగ్గి, రక్తం ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అధిక రక్తపోటు (బీపీ) సమస్యను నియంత్రిస్తుంది. కాబట్టి గుండె పోటు (Heart Attack), స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దూరంగా ఉండేందుకు ఈ గింజలు ఎంతగానో తోడ్పడతాయి.

జీర్ణ వ్యవస్థకు మలబద్ధకం నివారణ.. అవిసె గింజలు(Flax Seed) దీర్ఘకాలిక మలబద్ధకం (Chronic Constipation) సమస్యకు ఒక అద్భుతమైన నివారణ మార్గం అని చెప్పవచ్చు. వీటిలో కరిగే మరియు కరగని ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ప్రేగుల కదలికలను (Bowel Movement) సులభతరం చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ హెల్త్‌కు తోడ్పడుతుంది.

Flax Seed

బరువు నిర్వహణ , డయాబెటిస్ నియంత్రణ.. బరువు తగ్గాలనుకునేవారికి అవిసె గింజలు ఒక కీలకమైన ఆహారం. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఉండే అధిక ఫైబర్ మరియు ప్రోటీన్. తద్వారా అధికంగా తినాలనే కోరిక తగ్గుతుంది, ఇది బరువు పెరగకుండా నివారిస్తుంది. అంతేకాకుండా, ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి, అందుకే డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారికి ఇవి మంచి పోషకాహారం.

అవిసె గింజ(Flax Seed)ల్లో అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి లిగ్నెన్స్. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు ఈస్ట్రోజెన్ లక్షణాలను కలిగి ఉంటాయి. లిగ్నెన్స్ గుణాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్ట్రేట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఈ గింజలకు ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మంట , హార్మోన్ల సమతుల్యత: అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మంటను (Inflammation) మరియు నొప్పుల సమస్యను తగ్గిస్తాయి. ఆర్థరైటీస్ (కీళ్ల నొప్పి) సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా, మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను (Hormone Imbalance) నివారించడంలో కూడా అవిసె గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.

అవిసె గింజలు చర్మానికి, జుట్టుకు కూడా అద్భుతమైన పోషణ అందిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గి, జుట్టు బలంగా, పొడుగ్గా, మెరిసేలా తయారవుతుంది. అవిసె గింజలను పొడి రూపంలో లేదా నూనె రూపంలో తీసుకోవచ్చు. వీటిని సమతుల ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే, వీటిని ఎక్కువగా తీసుకోవడం లేదా ప్రత్యేక ఆహారంగా మార్చుకునే ముందు నిపుణుల తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version